Bhagwant Mann : ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు ప‌చ్చ జెండా

నిరుద్యోగుల‌కు స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్

Bhagwant Mann  : పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ సానుకూల నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ఆయ‌న బిజీగా మారారు. రాష్ట్రంలో నిరుద్యోగుల‌కు ఉపాధి హామీ క‌ల్పించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

ప్ర‌మాణ స్వీకారం చేసిన వెంట‌నే 30 వేల మంది కాంట్రాక్టు ప‌ద్ద‌తిన ప‌ని చేస్తున్న వారంద‌రినీ ప‌ర్మినెంట్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అంతే కాదు 25 వేల ఉద్యోగాల భ‌ర్తీకి లైన్ క్లియ‌ర్ ఇచ్చారు.

ప‌నిలో ప‌నిగా ఎవ‌రైనా అవినీతికి పాల్ప‌డితే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చరించారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా టోల్ ఫ్రీ నెంబ‌ర్ ఇచ్చారు. వీలైతే వీడియో లేదంటే మెస్సేజ్ త‌న‌కు పంపించాల‌ని కోరారు.

తాజాగా రాష్ట్రంలో అనువైన ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు లైన్ క్లియ‌ర్ ఇచ్చారు. ఈ మేర‌కు ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుపై స‌మీక్ష చేప‌ట్టారు భ‌గ‌వంత్ మాన్(Bhagwant Mann ). కొత్త ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేసేందుకు వ‌చ్చే వారికి , పెట్టుబ‌డిదారుల‌కు సాద‌ర స్వాగ‌తం ప‌లుకుతున్న‌ట్లు చెప్పారు.

ఇందుకోసం రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను తాక‌ట్టు పెట్ట‌బోమంటూ స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వ ముఖ్య ఉద్దేశం, ప్ర‌ధాన ప్ర‌యారిటీ ఒక్క‌టే నిరుద్యోగం లేకుండా చేయాల‌ని. ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌ని చెప్పారు.

ఉపాధి క‌ల్పించే ప‌రిశ్ర‌మ‌ల‌ను ఆక‌ర్షించేందుకు విధానాల‌ను రూపొందించాల‌ని ఆదేశించారు సీఎం. ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు సంబంధించి నో ఆబ్జెక్ష‌న్ స‌ర్టిఫికెట్లు అందించే సింగిల్ విండో విధానాన్ని మరింత ప‌టిష్టం చేయాల‌న్నారు భ‌గ‌వంత్ మాన్(Bhagwant Mann ).

శాఖ‌ల ప‌రంగా అనుమ‌తులు ఇచ్చే ప్రక్రియ‌ను సుల‌భ‌త‌రం చేయాల‌ని సీఎం ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ను ఆదేశించారు. రాష్ట్రంలో ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుతో భ‌విష్య‌త్తు బాగుంటుంద‌న్నారు. స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ పై ఎక్కువ‌గా ఫోక‌స్ పెడుతున్న‌ట్లు తెలిపారు.

Also Read : మాపై మీ పెత్త‌నం స‌హించం

Leave A Reply

Your Email Id will not be published!