Bhagwant Mann : మ‌త ప‌ర‌మైన‌ది కాదు రాజ‌కీయ ఘ‌ర్ష‌ణ

సంచ‌ల‌న కామెంట్స్ చేసిన భ‌గ‌వంత్ మాన్

Bhagwant Mann : పంజాబ్ లోని పాటియాల‌లో చోటు చేసుకున్న ఘ‌ర్ష‌ణ‌ల‌పై సంచ‌ల‌న కామెంట్స్ చేశారు ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి భ‌గ‌వంత్ మాన్. శ‌నివారం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

ఈ ఘ‌ర్ష‌ణ‌లు మ‌త ప‌ర‌మైన‌వి కావ‌ని కేవ‌లం రాజ‌కీయ ప‌ర‌మైన‌విగా ఆయ‌న పేర్కొన్నారు. జ‌రిగిన ఘ‌ట‌న గురించి ఆరా తీశా. అందుకు బాధ్యులైన వారిని గుర్తించాం.

ఈ మేర‌కు ముగ్గురు పోలీస్ ఉన్నతాధికారుల‌ను బ‌దిలీ చేశామ‌ని చెప్పారు మాన్(Bhagwant Mann). ఈ ఘ‌ర్ష‌ణ‌ల‌కు ఎవ‌రు కార‌ణ‌మ‌నే దానిపై పూర్తి విచార‌ణ జ‌రిపించాల‌ని ఆదేశించాను.

త్వ‌ర‌లో నివేదిక బ‌య‌ట‌కు వ‌స్తుంది. ఆ త‌ర్వాత ఎవ‌రు పాల్గొన్నారో, ఎందుకు చేశార‌నేది తేలుతుంది. దోషులు ఎవ‌రైనా స‌రే ఎంత‌టి స్థానంలో ఉన్నా స‌రే వ‌దిలి పెట్టే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేశారు భ‌గ‌వంత్ మాన్.

పంజాబ్ ప్ర‌జ‌లు శాంతి, మ‌త సామ‌ర‌స్యాన్ని విశ్వ‌సిస్తున్నార‌ని, రాస్ట్రంలో అల్ల‌ర్ల‌ను, అసాంఘిక శ‌క్తుల‌ను సహించ బోదంటూ హెచ్చ‌రించారు. ప్ర‌భుత్వాన్ని బ‌ద్నాం చేసే ప‌ని మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు.

త‌మ వ‌ద్ద ఎవ‌రి ఆట‌లు సాగ‌వ‌న్నారు. లా అండ్ ఆర్డ‌ర్ ప్ర‌స్తుతం కంట్రోల్ లో ఉంద‌న్నారు భ‌గ‌వంత్ మాన్. పాటియాల‌లో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లు రాజ‌కీయంగానే ఉన్నాయ‌ని గ‌తంలో నివేదించిన‌ట్లుగా మ‌త ప‌ర‌మైన‌వి కావ‌న్నారు.

కొంత మంది స‌భ్యులు, వారి జిల్లా అధినేత , భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన కొంద‌రు ఉన్నారు. మ‌రో వైపు శిరోమ‌ణి అకాలీద‌ళ్ కార్య‌క‌ర్త‌లు ఉన్నార‌ని చెప్పారు. ఇది రెండు రాజ‌కీయ పార్టీల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ , మ‌తప‌ర‌మైన‌ది కాద‌న్నారు.

Also Read : కేంద్రం నిర్వాకం వ‌ల్లే బొగ్గు, విద్యుత్ కొర‌త

Leave A Reply

Your Email Id will not be published!