Bhagwant Mann Marriage : ఇంటి వాడైన భగవంత్ మాన్
హాజరైన అతిరథ మహారథులు
Bhagwant Mann Marriage : పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఓ ఇంటి వాడయ్యాడు. ఆయనకు ఇది రెండో వివాహం. మొదటి భార్యకు విడాకులు ఇచ్చారు. ఆయనకు ఇప్పటికే కొడుకు, కూతురు ఉన్నారు.
తాజాగా తన ఫ్యామిలీకి చెందిన డాక్టర్ గురు ప్రీత్ కౌర్ ను గురువారం పెళ్లి చేసుకున్నారు. భగవంత్ మాన్ చండీగఢ్ లోని తన ఇంట్లో జరిగిన కార్యక్రమంలో ఈ తతంగం జరిగింది.
ఈ వివాహ వేడుకలకు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పాటు పంజాబ్ రాష్ట్ర ఇన్ చార్జ్ రాజీవ్ చద్దా , తదితర ప్రముఖులు హాజరయ్యారు.
గుర్ ప్రీత్ కౌర్ కు 32 ఏళ్లు. చాలా కొద్ది మందికి మాత్రమే ఆహ్వానం అందింది. రాఘవ్ చద్దా వివాహ వేడుకలకు సంబంధించిన ఫోటోలను
షేర్ చేశారు. పెళ్లి చేసుకున్న భగవంత్ మాన్ సాహెబ్ కు అభినందనలు అంటూ పేర్కొన్నారు రాఘవ్ చద్దా.
ఇక పంజాబ్ సీఎంకు 48 ఏళ్లు. ఆరేళ్ల పాటు మొదటి భార్యతో ఉన్నారు. వ్యక్తిగత కారణాల రీత్యా వారిద్దరూ వేరయ్యారు. విడాకులు కూడా
తీసుకున్నారు. గత కొంత కాలం నుంచి తమ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన డాక్టర్ తో సన్నిహితంగా ఉంటూ వచ్చారు.
ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన పంజాబ్ ఎన్నికల ప్రచారంలో గుర్ ప్రీత్ కౌర్ భగవంత్ మాన్(Bhagwant Mann Marriage) కు సహాయం చేసింది. అయితే మాన్ మళ్లీ పెళ్లి చేసుకుని స్థిర పడాలనేది తన తల్లి కల అని చద్దా పేర్కొన్నారు.
పిల్లలు, మాజీ భార్య అమెరికాలో ఉంటున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. వివాహ కార్యక్రమం జోర్దార్ గా జరిగింది.
మెనూలో కరాహి పనీర్ , తందూరు కుల్చే, దాల్ మఖానీ, నవ రతన్ బిర్యానీ, మౌసమీ సబ్జియాన్ , అప్రికోట్ స్టడ్ కోప్టా , లాసాగ్నా, సిసిలియానో ,
బుర్రానీ రైటాతో సహా భారతీయ, ఇటాలియన్ వంటకాలు వడ్డించారు.
ఫ్రెష్ ఫ్రూట్ ట్రిఫిల్ , మూంగ్ దాల్ హల్వా, షాహీ తుక్డా, అంగూరీ రస్ మలై, డ్రై ఫ్రూట్ రాబరీ కూడా ఉన్నాయి.
Also Read : ఎవరీ వీరేంద్ర హెగ్గడే ఏమిటా కథ