Bhagwant Mann : పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే ఎవరైనా లంచం అడిగితే వెంటనే తనకు ఫోన్ చేయాలని ఏకంగా టోల్ ఫ్రీ నెంబర్ డిక్లేర్ చేశారు.
ఆపై రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులకు ఒకే పెన్షన్ సౌకర్యాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. వీటి ద్వారా మిగిలిన డబ్బులతో విద్యా రంగం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.
ఖాళీగా ఉన్న 25 వేల పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు. అంతే కాదు రాష్ట్రంలో కొన్నేళ్లుగా కాంట్రాక్టు పద్దతిన పని చేస్తున్న 30 వేల మందికి పైగా పర్మినెంట్ చేస్తున్నట్లు వెల్లడించారు భగవంత్ మాన్(Bhagwant Mann).
రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ ఆఫీసుల్లో ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన సీఎం, ప్రధాని మోదీ ఫోటోలను తీసి వేయాలని సీఎం ఆదేశించారు. శనివారం సంచలన ప్రకటన చేశారు భగవంత్ మాన్.
మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో సహా 184 మందికి సంబంధించిన సెక్యూరిటీని ఉపసంహరించినట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా సెక్యూరిటీ కోల్పోయిన వారిలో మాజీ మినిష్టర్స్ బీబీ జాగీర్ కౌర్ , మదన్ మోహన్ మిట్టల్ , రఖ్రా, చోటే పూర్ , జన మేజా సింగ్ సెఖోన్ , గుల్జార్ సింగ్ రాణి, తదితరులు ఉన్నారు.
విచిత్రం ఏమిటంటే మాజీ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ, అమరీందర్ సింగ్ కుమారుడు రణిందర్ సింగ్ ఫ్యామిలీకి ఏర్పాటు చేసిన భద్రతను కోల్పోనున్నారు.
ఐపీఎల్ మాజీ చైర్మన్ రాజీవ్ శుక్లా ఉండడం కూడా విశేషం. బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న మహి గిల్ , మాజీ డీజీపీ సిద్దాంత్ కూడా సెక్యూరిటీ తొలగించారు.
Also Read : బీజేపీపై శివసేన కన్నెర్ర