Bhagwant Mann : అమరులకు వందనం వీరులకు అభివందనం
భగత్ సింగ్ ,రాజ్ గురు, సుఖ్ దేవ్ లకు సీఎం నివాళి
Bhagwant Mann :పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సర్దార్ షహీద్ భగత్ సింగ్ (Sardar Shahid Bhagat Singh) , రాజ్ గురు, సుఖ్ దేవ్ (Sukhdev) ల వర్దంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు చేసిన బలిదానం స్పూర్తి దాయకమని పేర్కొన్నారు.
అసమాన వీరులను తలుచు కోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని పేర్కొన్నారు. దేశ స్వాతంత్రం కోసం తమ అమూల్యమైన ప్రాణాలను పణంగా పెట్టారని తెలిపారు.
తమ విలువైన యవ్వనాన్ని, జీవితాలను ఈ దేశం కోసం బలి పెట్టారని, ఉరి కొయ్యలను చిరునవ్వుతో స్వీకరించిన ఈ వీరుల గురించి ఎంత చెప్పినా తక్కువేనని కొనియాడారు సీఎం భగవంత్ మాన్ (Bhagwant Mann).
అమరులు కన్న కలలను సాకారం చేసేందుకు ఆప్ ప్రభుత్వం పని చేస్తుందని స్పష్టం చేశారు. పంజాబ్ రాష్ట్రాన్ని అవినీతి రహిత, సుసంపన్నమైన, బంగారు పంజాబ్ గా మారుస్తామని పేర్కొన్నారు సీఎం.
అందుకే తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటిగా నెరవేరుస్తూ వచ్చామన్నారు. అంతే కాకుండా గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తాము పాలన సాగిస్తున్నామని తెలిపారు.
అమరుల వర్దంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని తాము వారికిచ్చే అరుదైన నివాళి ఇది అని భగవంత్ మాన్ పేర్కొన్నారు. అంతే కాదు మొదటి సారిగా రాష్ట్రంలో సెలవు ప్రకటించామని చెప్పారు.
అవినీతి, అక్రమాలకు తావు లేకుండా ఉండేందుకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశామన్నారు. అంతే కాదు ఎవరైనా లంచం అడిగితే తనకు నేరుగా వాట్సాప్ ద్వారా వీడియో కానీ మెస్సేజ్ చేయాలని సీఎం పిలుపునిచ్చారు.
Also Read : మేరా భారత్ మహాన్