Raghav Chadha : భ‌గ‌వంత్ మాన్ నిర్ణ‌యం దేశానికి ఆద‌ర్శం

ప్ర‌శంసించిన ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దా

Raghav Chadha : త‌న కేబినెట్ లో అవినీతికి పాల్ప‌డిన ఆరోగ్య శాఖ మంత్రి విజ‌య్ సింగ్లాపై వేటు వేశారు పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్. అవినీతి, అక్ర‌మాలను తాము ప్రోత్స‌హించ‌మ‌ని, స‌హించే ప్ర‌స‌క్తి లేద‌ని ఆయ‌న ఇప్ప‌టికే హెచ్చ‌రించారు.

అంతే కాదే అవినీతి ర‌హిత పంజాబ్ రాష్ట్రంగా మారుస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఆచ‌ర‌ణ‌లో చేసి చూపిస్తున్నారు. ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా ఎవ‌రైనా స‌రే త‌న మొబైల్ కు ఎవ‌రైనా లంచం అడిగినా, లేదా డిమాండ్ చేసినా వెంట‌నే వాట్సాప్ కు మెస్సేజ్ ఇవ్వాల‌ని లేదంటే వీడియో తీసి పంపించాల‌ని పిలుపునిచ్చారు.

ఇందు కోసం యాంటీ క‌ర‌ప్ష‌న్ టోల్ ఫ్రీ నెంబ‌ర్ కూడా డిక్లేర్ చేశారు. తాను ప్ర‌జ‌ల మ‌నిషిన‌ని, ధ‌న‌వంతుల‌కు, వ్యాపార‌వేత్త‌ల‌కు, బ‌డా బాబుల‌కు గులాం కాన‌ని హెచ్చ‌రించారు.

ఆ మేర‌కు ఆయ‌న ఏకంగా కేబినెట్ స‌హ‌చ‌ర మంత్రిపై వేటు వేయ‌డం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేగింది. దేశ చ‌రిత్ర‌లో ఇది రెండోసారి మాత్ర‌మే జ‌రిగింది. 2015లో సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ త‌న కేబినెట్ లో మంత్రిని త‌ప్పించారు.

2022లో స‌రిగ్గా ఏడేళ్ల స‌మ‌యంలో భ‌గ‌వంత్ మాన్ అసాధార‌ణ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా భ‌గ‌వంత్ మాన్ మ‌రోసారి రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు, మంత్రులు, ప్ర‌జా ప్ర‌తినిధులు, అధికారులకు అప్పీలు చేశారు.

ఎవ‌రైనా ఎంత‌టి స్థానంలో ఉన్నా అవినీతికి పాల్ప‌డితే స‌హించే ప్ర‌స‌క్తి లేద‌ని హెచ్చ‌రించారు. ఈ సంద‌ర్భంగా పంజాబ్ సీఎం తీసుకున్న ఈ సంచ‌ల‌న నిర్ణ‌యం దేశానికి ఆద‌ర్శ‌నీయ‌మ‌ని పేర్కొన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దా(Raghav Chadha).

Also Read : భ‌గ‌వంత్ మాన్ నిర్ణ‌యం కేజ్రీవాల్ భావోద్వేగం

Leave A Reply

Your Email Id will not be published!