Bhatti Vikramarka : ప్రజలతో మమేకం పుస్తకాలతో నేస్తం
అనుభవాలే జ్ఞాపకాలు ఈ పుస్తకాలు
Bhatti Vikramarka : సీఎల్పీ నేతగా అందరికీ సుపరిచితులే మల్లు భట్టి విక్రమార్క. ఆయన సోదరుడు మల్లు రవి మాజీ ఎంపీ. కాంగ్రెస్ పార్టీలో కొన్నేళ్లుగా అనుబంధం ఉంది. పార్టీకి సంబంధించి సీనియర్ నాయకుడిగా ఉన్నారు. వివాద రహితుడిగా పేరు పొందిన భట్టి విక్రమార్క అందరినీ కలుపుకుని పోయేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పార్టీ అన్నాక భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. అలాగని వారిని పక్కన పెట్టలేం అంటారు. ప్రతి ఒక్కరినీ ఆదరించడం, వారితో మమేకం కావడం భట్టి విక్రమార్క చేస్తున్నారు.
ఓ వైపు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు శత విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇతర పార్టీల నేతలు సైతం ఆ పార్టీ వైపు చూస్తున్నారు. మరో వైపు భారీ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka). ఆదిలాబాద్ జిల్లా నుంచి మొదలైన ఈ యాత్ర ఇంకా తెలంగాణలో కొనసాగుతోంది. చివరకు ఖమ్మం జిల్లాకు చేరుకుంటుంది.
పాదయాత్ర లో భాగంగా ఇటీవల కొంత వడ దెబ్బకు గురయ్యారు. ఆయన చికిత్స తీసుకున్నారు. తిరిగి కోలుకున్నాక మళ్లీ పీపుల్స్ మార్చ్ యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇదే సమయంలో ఎవరైనా సమయం పిచ్చా పాటీ మాట్లాడేందుకు ఇష్ట పడతారు. కానీ భట్టి విక్రమార్క అలా కాదు. ఆయనకు ఏ మాత్రం వీలు చిక్కినా సమయాన్ని వృధా చేయరు. సమాజాన్ని ప్రభావితం చేసే, ప్రజల గురించి తెలియ పరిచే పుస్తకాలను చదివేందుకు ఇష్టపడతారు. ఓ చెట్టు కింద కూర్చుని పుస్తకాన్ని చదువుతుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Also Read : Dil Raju : ‘తొలి ప్రేమ’ను మరువ లేను – దిల్ రాజు
