Bhatti Vikramarka : మహాలక్ష్మి..చేయూతకు శ్రీకారం
స్పష్టం చేసిన మల్లు భట్టి విక్రమార్క
Bhatti Vikramarka : హైదరాబాద్ – తాము ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka). ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళా సాధిదకారత దిశగా తొలి అడుగు వేశామన్నారు. చెప్పినట్టుగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
Bhatti Vikramarka New Scheme Announced
ఈ ఉచిత బస్సు సౌకర్యం వల్ల ఊర్ల నుంచి సమీప పట్టణాలకు, నగరాలకు వెళ్లేందుకు ఆస్కారం ఏర్పడుతుందన్నారు. దీని వల్ల వేలాది మంది విద్యార్థినులు, మహిళలు, వృద్దులకు ఆసరాగా ఉంటుందనడంలో సందేహం లేదన్నారు. ఇప్పటికే ఫ్రీ బస్ వల్ల ప్రతి రోజూ ఆర్టీసికి రూ. 4 కోట్ల భారం పడుతుందన్నారు.
అయినా ఆ మొత్తం భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. అంతే కాకుండా ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద రూ. 10 లక్షల వైద్య సాయం అందజేస్తామన్నారు. పేద ప్రజలకు చేయూత ఇచ్చేందుకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందజేస్తామని స్పష్టం చేశారు మల్లు భట్టి విక్రమార్క.
ఇదిలా ఉండగా అంతకు ముందు మంత్రులుగా కొలువు తీరిన తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలకు ఖమ్మం జిల్లాలో ఘన స్వాగతం లభించింది. వీరికి కీలక బాధ్యతలు అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి.
Also Read : Chinnajeeyar Swamy : కేసీఆర్ ఆరోగ్యంపై చినజీయర్ ఆరా