Bhatti Vikramarka : భూముల అప్ప‌గింత‌లో మీ వాటా ఎంత

బీఆర్ఎస్ స‌ర్కార్ పై మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌

Bhatti Vikramarka : పేద‌ల భూముల‌కు ర‌క్ష‌ణ‌గా ఉండాల్సిన రాష్ట్ర ప్ర‌భుత్వం అప్ప‌నంగా కాజేసి బ‌డా బాబుల‌కు అప్పగిస్తున్నార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు(Bhatti Vikramarka Mallu). ఆయ‌న చేప‌ట్టిన పీపుల్స్ మార్చ్ కొన‌సాగుతోంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు భ‌ట్టి విక్ర‌మార్క‌.

పాల‌న ప‌డ‌కేసింద‌ని, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకునే నాథుడు లేకుండా పోయాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. జ‌వాబుదారీత‌నం లోపించింద‌ని, బాధ్య‌తా రాహిత్యంతో ప‌ని చేస్తున్నారంటూ మండిప‌డ్డారు. మ‌ద్యం వ్యాపారం చేస్తూ, రియ‌ల్ ఎస్టేట్ దందాకు పాల్ప‌డుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్ర‌మేన‌ని అన్నారు. ఇందుకు సంబంధించి సిగ్గు ప‌డాల‌ని అన్నారు.

విద్య‌, వైద్యం, ఉపాధి ప‌డ‌కేసింద‌న్నారు. స్కూళ్లు బోసి పోతున్నాయ‌ని, టీచ‌ర్ జాబ్స్ లేక పిల్ల‌ల‌కు పాఠాలు చెప్పే వాళ్లు లేకుండా పోయార‌ని మండిప‌డ్డారు. రాష్ట్రంలో 2 ల‌క్ష‌ల ఖాళీలు ఉంటే ఒక్క పోస్టు కూడా భ‌ర్తీ చేసిన పాపాన పోలేద‌న్నారు.

ప‌దే ప‌దే కేటీఆర్ చెబుతున్న మాట‌లన్నీ అబ‌ద్దాలు త‌ప్ప నిజాలు కావ‌న్నారు. పేద‌లకు చెందిన భూముల‌ను లాక్కోవ‌డం, బ‌ల‌వంతంగా దౌర్జ‌న్యం చేయ‌డం చివ‌ర‌కు వాటిని వ్యాపార‌వేత్త‌ల‌కు క‌ట్టబెట్ట‌డం జ‌రుగుతూ వ‌స్తోంద‌న్నారు. వారికి భూముల‌ను అప్ప‌గించినందుకు క‌ల్వ‌కుంట్ల ఫ్యామిలీకి ఎంత వాటా దక్కుతుందో చెప్పాలంటూ మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క డిమాండ్ చేశారు.

Also Read : Joe Biden Visa Issue : వీసాల జారీకి చ‌ర్య‌లు చేప‌ట్టండి

Leave A Reply

Your Email Id will not be published!