Joe Biden Visa Issue : వీసాల జారీకి చ‌ర్య‌లు చేప‌ట్టండి

అమెరికా అధ్య‌క్షుడు బైడెన్ కు విన్న‌పం

Joe Biden Visa Issue : అమెరికాకు ఎక్కువ మంది వెళ్లే వారిలో భార‌త్ నుంచే అధికం. జో బైడెన్(Joe Biden) అధికారంలోకి వ‌చ్చాక స‌మ‌స్య మ‌రింత జ‌ఠిలంగా మారింది. క‌రోనా ప్ర‌భావం కార‌ణంగా వీసాల జారీ ప్ర‌క్రియకు అంత‌రాయం ఏర్ప‌డింది. ప్ర‌స్తుతం మ‌హ‌మ్మారి త‌గ్గుముఖం ప‌ట్టింది. అయినా వీసాల మంజూరులో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది. దీనిపై ఇప్ప‌టికే కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్ అమెరికాలో ప‌ర్య‌టించిన సంద‌ర్భంగా ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు.

సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ఈ ఇష్యూను కొలిక్కి వ‌చ్చేలా చేయాల‌ని కోరారు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు వీసాల జారీ మ‌రింత ఆల‌స్యం అవుతోంది. ఎక్కువ‌గా వీసా కోసం నిరీక్షిస్తున్న వారిలో ల‌క్ష‌కు పైగా దాటింది. ఎక్కువ‌గా హెచ్ 1 బి, స్టూడెంట్ వీసాలు ఇందులో ఉన్నాయి. ప్ర‌ధానంగా ఐటీ కంపెనీల‌లో ఎక్కువ‌గా ప‌ని చేస్తున్న‌ది భార‌తీయులే. టెక్నాల‌జీ ప‌రంగా మ‌నోళ్లే టాప్ లో కొన‌సాగుతున్నారు. ఓ వైపు ఆర్థిక మాంద్యం దెబ్బ‌కు చాలా మంది జాబ్స్ కోల్పోయారు.

ఇందులో ఇండియ‌న్లు కూడా ఉన్నారు. ఒక‌వేళ ఉద్యోగం కోల్పోతే వెంట‌నే జాబ్ తెచ్చు కోవాల్సి ఉంటుంది. లేక పోతే భార‌త్ బాట ప‌ట్టాల్సిందే.

ఈ త‌రుణంలో వీసా జారీల ప్ర‌క్రియ రోజు రోజుకు మ‌రింత జ‌ఠిలం కావ‌డంతో అమెరికా చ‌ట్ట స‌భ‌లో స‌భ్యులు తీవ్రంగా ప‌రిగ‌ణిస్తూ వెంట‌నే అమెరికా చీఫ్ జోసెఫ్ బైడెన్ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. సిబ్బందిని నియ‌మించాల‌ని, వెరిఫికేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని కోరారు. దీనిపై జో బైడెన్ స‌మీక్షించే ఛాన్స్ ఉంది.

Also Read : Yuva Galam Support : ఓవెల్ మైదానంలో ‘యువ గ‌ళం’ హ‌వా

Leave A Reply

Your Email Id will not be published!