Bheemla Nayak Trailer : భీమ్లా నాయ‌క్ ట్రైల‌ర్ అదుర్స్

మంత్రి మ‌రణంతో వేడుక వాయిదా

Bheemla Nayak Trailer  : సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన భీమ్లా నాయ‌క్ (Bheemla Nayak Trailer )మూవీకి సంబంధించి ట్రైల‌ర్ విడుద‌లైంది. ఏపీ మంత్రి మేక‌పాటి గౌతం రెడ్డి అకాల మ‌ర‌ణంతో సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ వాయిదా వేసింది.

ఈ కార్య‌క్ర‌మానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా రావాల్సి ఉంది. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న స‌త్తా ఏమిటో చూపించాడు ద‌ర్శ‌కుడు. ఇక సినిమా ట్రైల‌ర్ కోసం వేచి చూసిన అభిమానుల‌కు ఫుల్ జోష్ నింపింది.

ఇక భీమ్లానాయ‌క్ మూవీలో(Bheemla Nayak Trailer )ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటు రానా ద‌గ్గుబాటి న‌టించాడు. సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ నిర్మించింది ఈ చిత్రాన్ని. దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించాడు.

సూర్య దేవర నాగ‌వంశీ నిర్మిస్తున్నాడు. నిర్మాణ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 25న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేసేందుకు మూవీ మేక‌ర్స్ నిర్ణ‌యించారు.

ఇప్ప‌టికే విడుద‌ల చేసిన భీమ్లా నాయ‌క్ పోస్ట‌ర్లు, టీజ‌ర్స్, సాంగ్స్ కు భారీ ఆద‌ర‌ణ ల‌భించింది. మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ అయిన మూవీ అయ్య‌ప్ప‌కోశియంకు మాతృక మూవీనే భీమ్లా నాయ‌క్ చిత్రం.

ఈ సినిమాకు దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఎస్. ఎస్. థ‌మ‌న్ అందించారు. ఇక నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లాకు చెందిన కిన్నెర వాయిద్య‌కారుడు కిన్నెర మొగుల‌య్య భీమ్లా నాయ‌క్ టైటిల్ సాంగ్ కు ముందు గొంతు అందించాడు.

ఇక ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటు నిత్య మీన‌న్ జంట‌గా న‌టించింది.

Also Read : దుమ్ము రేపుతున్న ‘అర‌బిక్ కుతు’

Leave A Reply

Your Email Id will not be published!