Bhola Shankar Song : మెగా భోళా శంక‌ర్ సాంగ్ అదుర్స్

రామ జోగ‌య్య శాస్త్రి పాట‌కు ఫిదా

Bhola Shankar Song : వ‌య‌సు మీద ప‌డినా ఇప్ప‌టికీ ఎన‌ర్జిటిక్ గా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఎల్ల‌ప్పుడూ సంతోషంగా ఉండ‌ట‌మే త‌న ఆనందానికి కార‌ణ‌మ‌ని అంటుంటారు. ఓ వైపు యువ స్టార్లు దుమ్ము రేపుతుంటే మ‌రో వైపు చిరంజీవి కూడా త‌న‌కు ఎదురే లేద‌ని దుమ్ము రేపుతున్నాడు.

తాజాగా మెహ‌ర్ ర‌మేశ్ ద‌ర్శ‌క‌త్వంలో మెగాస్టార్ చిరంజీవి న‌టించిన భోళా శంక‌ర్(Bhola Shankar) ఇప్పుడు వైర‌ల్ గా మారింది. మ‌హతి స్వ‌ర సాగ‌ర్ ఈ మూవీకి సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సాంగ్ ను విడుద‌ల చేశారు మూవీ మేక‌ర్స్. అదిరే స్టైల‌య్యా..ప‌గిలే స్వాగ‌య్యా..యుఫోరియా నా ఏరియా..భోళా మానియా అంటూ సాగే పాట ఇప్పుడు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది.

అనిల్ సుంక‌ర నిర్మిస్తున్న భోళా శంక‌ర్ చిత్రంలో త‌మ‌న్నా భాటియా తో పాటు కీర్తి సురేష్ న‌టిస్తోంది. కొత్త సాంగ్ ను మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీ ప్ర‌సాద్ ఆవిష్క‌రించారు. త‌న‌కంటే గొప్ప‌గా పాట చేశాడంటూ మ్యూజిక్ డైరెక్ట‌ర్ మ‌హతిని అభినంద‌న‌ల‌తో ముంచెత్తాడు. త‌మ్ముడు జ‌స్ట్ కుమ్ముడు అంటూ ట్విట్ట‌ర్ లో కితాబు ఇచ్చాడు. దీనికి మెగాస్టార్ చిరంజీవి సైతం ఆనందం వ్య‌క్తం చేస్తూ రీట్వీట్ చేశాడు.

కాగా ఈ పాట‌ను సంగీత ద‌ర్శ‌కుడు మ‌హ‌తి, ఎల్ వి రేవంత్ ఆలాపించారు. మెగా అభిమానుల‌ను మ‌రింత కిక్కు ఎక్కించేలా ఉంది ఈ సాంగ్. దీంతో ఇప్పుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది.

Also Read : CM KCR : కాంగ్రేసోళ్ల‌ను బంగాళా ఖాతంలో వేయండి

 

Leave A Reply

Your Email Id will not be published!