Bhumana Karunakar Reddy : జ‌న‌సేనానిపై భూమ‌న‌ క‌న్నెర్ర‌

యుద్ధం అన్నాడు బాబుతో చేతులు క‌లిపాడు

Bhumana Karunakar Reddy : వైఎస్సార్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేల‌ను బండ‌బూతులు తిట్టిన జ‌న‌సేన పార్టీ చీఫ్‌, ప్ర‌ముఖ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై నిప్పులు చెరిగారు టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి(Bhumana Karunakar Reddy). ఇప్ప‌టికే రాష్ట్రంలో ఎవ‌రు ఎలాంటి వార‌నేది ప్ర‌జ‌ల‌కు తెలిసి పోయింద‌న్నారు. అందుకే బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన‌కు కోలుకోలేని షాక్ ఇచ్చార‌ని పేర్కొన్నారు.

అయినా వీళ్ల‌కు ఇంకా బుద్ది రావ‌డం లేద‌ని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎక్క‌డా లేనంత‌గా అభివృద్ది జ‌రుగుతోంద‌న్నారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా నాడు నేడు కార్య‌క్ర‌మంతో విద్యా వ్య‌వ‌స్థ‌ను అభివృద్ది చేయ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. మ‌రో వైపు ప్ర‌భుత్వం వినూత్నంగా ఏర్పాటు చేసిన వైఎస్సార్ రైతు భ‌రోసా కేంద్రాలు ప్ర‌పంచ దేశాల‌ను ఆక‌ర్షిస్తున్నాయ‌ని స్ప‌ష్టం చేశారు.

అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల అభ్యున్న‌తే ధ్యేయంగా ప్ర‌భుత్వం ప‌ని చేస్తోంద‌ని చెప్పారు. ఇదే స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ నోరు పారేసుకోవ‌డం ఆయ‌న విజ్ఞ‌త‌ను, సంస్కారాన్ని తెలియ చేస్తోంద‌న్నారు. తాను నిత్యం ప్ర‌ముఖ ర‌చ‌యిత గుడిపాటి వెంక‌ట చ‌లం , ప్ర‌పంచ పోరాట వీరుడు చేగువేరాను ఆద‌ర్శం అని చెప్పుకునే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇలాంటి చ‌వ‌క‌బారు, దిగ‌జారుడు మాట‌లు ఎలా మాట్లాడుతున్నాడంటూ ప్ర‌శ్నించారు భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి.

మొన్న‌టి దాకా ప్ర‌జ‌ల కోసం యుద్దం చేస్తాన‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లికాడ‌ని చివ‌ర‌కు టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు నాయుడ‌తో చేతులు క‌లిపాడంటూ మండిప‌డ్డారు. ఇలాంటి దిగ‌జారుడు మాట‌ల‌తో కార్య‌క‌ర్త‌ల‌కు ఎలాంటి సందేశం ఇవ్వ‌ద‌ల్చు కున్నారో చెప్పాల‌న్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎంత‌గా మాట్లాడినా జ‌నం న‌మ్మ‌ర‌న్నారు. ముందు నీ స్టాండ్ ఏంటో చెప్పాల‌ని భూమ‌న డిమాండ్ చేశారు.

Also Read : ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా రెడీ

Leave A Reply

Your Email Id will not be published!