Bhumana Karunakar : శ్రీవారి ఆలయం ముందు హారతితో ప్రమాణం చేసిన మాజీ చైర్మన్

ఈ సందర్బంగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు కరుణాకర్ రెడ్డి యత్నించారు...

Bhumana Karunakar : టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని ఏపీ పోలీసులు ఇవాళ(సోమవారం) అదుపులోకి తీసుకున్నారు. అఖిలాండం వద్ద కరుణాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని.. అతని వాహనంలోనే తిరుపతికి తరలించారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ… కొద్ది రోజులుగా తన మనస్సు తల్లడిల్లిపోతోందని.. తాను ఏ తప్పు చేయలేదని… ఏ పరీక్షకైనా సిద్ధమని కరుణాకర్ రెడ్డి చెప్పారు.

Bhumana Karunakar Reddy Comment

తన హయాంలో ఏదైనా తప్పు చేసి ఉంటే.. తాను.. తన కుటుంబం నాశనం అయిపోతామని కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేశారు. ఈ సందర్బంగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు కరుణాకర్ రెడ్డి యత్నించారు. లడ్డూలు కలంకితమైందని.. కలుషిత రాజకీయ మనుషులు ఆరోపణలు చేశారని అన్నారు. ఈ సమయంలో కరుణాకర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read : Haryana Elections : కాంగ్రెస్ కు హర్యానాలో మరో కొత్త తలనొప్పి..సీఎం రేసులో నేనంటే నేనంటున్న నేతలు

Leave A Reply

Your Email Id will not be published!