Bhupinder Hooda : రాహుల్ ను క‌లిసిన‌ రెబ‌ల్ లీడ‌ర్

భూపింద‌ర్ హూడా క‌ల‌యిక‌పై ఆస‌క్తి

Bhupinder Hooda : ఊహించ‌ని ప‌రిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ వేదిక‌గా కాంగ్రెస్ రెబ‌ల్స్ గా పేరొందిన, గత కొంత కాలం నుంచి అస‌మ్మ‌తి స్వ‌రం వినిపించిన నాయ‌కుల్లో భూపింద‌ర్ సింగ్ హూడా కూడా ఒక‌రుగా ఉన్నారు.

ఢిల్లీలో గులాం న‌బీ ఆజాద్ నేతృత్వంలో జీ -23 నాయ‌కులు స‌మావేశం అయ్యారు. ఇటీవ‌ల దేశంలో ఐదు రాష్ట్రాల‌లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓట‌మి పాలైంది.

18 మంది కాంగ్రెస్ నాయ‌కులు ఈ అత్య‌వ‌స‌ర భేటీలో పాల్గొన్నారు. తాజాగా రెబ‌ల్ నాయ‌కుడు భూపేంద‌ర్ హూడా (Bhupinder Hooda)కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహులు గాంధీని క‌లవ‌డం అత్యంత ప్రాధాన్యం సంత‌రించుకుంది.

ఇదిలా ఉండ‌గా కాంగ్రెస్ పార్టీలో సీనియ‌ర్ నాయ‌కుడిగా ఉన్నారు. ఎంతో అనుభ‌వం ఉంది. గాంధీ కుటుంబానికి మొద‌టి నుంచీ విధేయుడిగా ఉంటూ వ‌చ్చారు. కానీ ఇటీవ‌ల గులాం న‌బీ ఆజాద్ టీంలోకి ఎంట‌ర్ అయ్యారు.

ఇటీవ‌ల త‌న కుమారుడు దీపింద‌ర్ హూడాకు రాష్ట్ర పీసీసీ చీఫ్ ఇవ్వ‌క పోవ‌డంపై అల‌క వ‌హించారు. దీంతో క‌ల‌త చెందిన హూడా ఆజాద్ టీంలోకి జంప్ అయ్యారు.

మ‌రో వైపు గాంధీ ఫ్యామిలీకి అత్యంత స‌న్నిహితురాలిగా భావిస్తున్న హార్యానా కాంగ్రెస్ చీఫ్ సెల్జా కుమారితో భూపింద‌ర్ హూడాకు(Bhupinder Hooda) వైరం నెల‌కొంది.

స‌మిష్టిగా బీజేపీపై పోరాటం సాగించాల‌ని, భావ సారూప్య‌త క‌లిగిన పార్టీల‌తో క‌లుపుకుని పోవాల‌ని అస‌మ్మ‌తి నేత‌లు కొత్త రాగం ఆలాపించారు.

అయితే కాంగ్రెస్ పార్టీలో రెండు వ‌ర్గాలుగా విడి పోయారు. ఓ వ‌ర్గం గాంధీ ఫ్యామిలీకి మ‌ద్ద‌తు తెలుపుతుండ‌గా మ‌రో వ‌ర్గం ఆ ఫ్యామిలీకి వ్య‌తిరేకంగా ఉంటోంది.

Also Read : సుప్రీంకు చేరిన హిజాబ్ వివాదం

Leave A Reply

Your Email Id will not be published!