Biden Evacuated : విమానం క‌ల‌క‌లం వైట్ హౌస్ అప్ర‌మ‌త్తం

దాడి కాదంటూ ప్ర‌క‌టించిన యుస్ ప్ర‌భుత్వం

Biden Evacuated : నో జోన్ ప‌రిధిలోకి విమానం క‌ల‌క‌లం రేపింది. విమానం బీచ్ హోమ్ మీదుగా ఎగ‌ర‌డం చ‌ర్చ‌కు దారి తీసింది. దీంతో వైట్ హౌస్ లో ఏం జ‌రుగుతుందోన‌న్న ఉత్కంఠ నెల‌కొంది.

ఇది ఎంత మాత్రం దాడి కాద‌ని పేర్కొన్నారు వైట్ హౌస్ ప్ర‌తినిధులు. వాషింగ్ట‌న్ దూర్పున 200 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న డెలావేర్ లోని రెహోబోత్ బీచ్ లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

దేశ అధ్య‌క్షుడు జోసెఫ్ బైడెన్ , ప్ర‌థ మ‌హిళ జిల్ బైడెన్(Biden Evacuated) సుర‌క్షితంగా ఉన్నార‌ని వైట్ హౌస్ అధికారి వెల్ల‌డించారు. ఇదిలా ఉండ‌గా గుర్తు తెలియ‌ని విమానం బీచ్ హోమ్ మీదుగా ఎగ‌ర‌డంతో వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన భ‌ద్రతా సిబ్బంది బైడెన్ ను, భార్య‌ను ఉన్న‌ప‌ళంగా ఖాళీ చేయించారు.

కాగా ఇది ఎంత మాత్రం అటాకింగ్ కాదంటూ స్ప‌ష్టం చేశారు. అయితే దాడి కాద‌ని నిర్ధారించుకున్న అనంత‌రం ప్రెసిడెంట్ జోసెఫ్ బైడెన్ , భార్య జిల్ బైడెన్ తిరిగి వైట్ హౌస్ కు వ‌చ్చార‌ని తెలిపారు.

చిన్న ప్రైవేట్ విమానం పొర‌పాటున నియంత్రిత గ‌గ‌న త‌లంలోకి వెళ్లింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన భ‌ద్ర‌తా సిబ్బంది మొత్తం అల‌ర్ట్ అయ్యింది.

ఈ ప్రెసిడెంట్, భార్య సుర‌క్షితంగా, క్షేమంగా ఉన్నార‌ని ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని వైట్ హౌస్ స్ప‌ష్టం చేసింది.

ప్రెసిడెంట్ ను ర‌క్షించే బాధ్య‌త‌ను స్వీక‌రించిన సీక్రెట్ స‌ర్వీస్ విమానం పొర‌పాటున సుర‌క్షిత ప్రాంతంలోకి ప్ర‌వేశించింద‌ని , వెంట‌నే బ‌య‌ట‌కు పంపించామ‌ని తెలిపారు.

ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ ప్రారంభించింది సీక్రెట్ స‌ర్వీసెస్.

Also Read : ట‌ర్కీ పేరు మార్పుపై యుఎన్ ఓకే

Leave A Reply

Your Email Id will not be published!