Presidential Polls 2022 : ఇద్దరూ ఇద్దరే తలపండిన ఉద్దండులే
ఆదివాసీ బిడ్డ..తలపండిన రాజకీయ నేత
Presidential Polls 2022 : అంతా ఊహించినట్టుగానే భారత దేశ అత్యున్నత రాష్ట్రపతి పదవి ఎంపిక(Presidential Polls 2022) పై ఉత్కంఠ
కంటిన్యూగా కొనసాగుతోంది. బహుశా దేశ రాజకీయాలలో ఈసారి జరిగే ఎన్నిక చారిత్రాత్మకం కానుంది.
విచిత్రం ఏమిటంటే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ (ఎన్డీయే ) ఊహించని రీతిలో తమ ఉమ్మడి అభ్యర్థిని
ప్రకటించింది.
ఇది విపక్షాలకు కోలుకోలేని షాక్. ఇప్పటి దాకా తాను ఏది చెబితే అది చేస్తూ వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాష్ట్రపతి ఎంపిక సవాల్ గా మారింది.
ఆయన వెనుకబడిన తరగతుల వర్గానికి చెందిన వ్యక్తి. ఓ చాయ్ వాలాగా ప్రారంభించి సీఎంగా, ప్రధాని వరకు ఎదిగారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకులలో ఒకడిగా పేరొందారు.
విపక్షాలకు కంటి మీద కునుకు లేకుండా చేయడంలో దిట్టగా పేరొందారు ట్రబుల్ షూటర్ , కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా. చివరి వరకు ఉమ్మడి అభ్యర్థిగా క్లీన్ ఇమేజ్ కలిగిన వ్యక్తిని రాష్ట్రపతి పదవికి ఎంపిక చేయాలని ప్రయత్నాలు చేసింది బీజేపీ.
కానీ విపక్షాలు ఒప్పుకోలేదు. ఎందుకంటే మోదీ కొలువు తీరాక దేశంలో ఒకే పార్టీ ఒకే భాష ఒకే సిద్దాంతం ఉండాలన్న బీజేపీ(BJP) మూల సూత్రాన్ని
అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు.
ఇప్పటి వరకు మోదీ ఏది చెబితే అది జరుగుతూ వచ్చింది. కానీ ఆయన ఒకే ఒక్క విషయంలో ఓటమి పాలయ్యారు. అది అన్నం పెట్టే రైతన్నల చేతుల్లో. ఇది ఒక్కటే మోదీకి మైనస్ పాయింట్.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే మోదీ ఏం చెబితే అది. రాష్ట్రపతి అయినా లేదా ఇంకెవరైనా. కానీ నిన్నటి దాకా భారతీయ జనతా పార్టీ
అంటేనే ఉన్నత వర్గాలు, వ్యాపారస్తుల పార్టీ అని ముద్ర పడింది.
కానీ మోదీ కొలువు తీరాక దానిని పూర్తిగా మార్చేశారు. బడుగు, బలహీన, మైనార్టీ, ఆదివాసీ వర్గాలకు ప్రయారిటీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు.
అందులో భాగంగానే విపక్షాలకు ధీటుగా బీజేపీ నిర్ణయం తీసుకుంది.
ఒడిశాకు చెందిన ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా(Presidential Polls 2022) ప్రకటించింది. ముర్ము కష్టపడి పైకొచ్చారు. జూనియర్ అసిస్టెంట్ గా, పంచాయతీ కౌన్సిలర్ గా, బీజేపీ జాతీయ నాయకురాలిగా ఎదిగారు. గవర్నర్ గా పని చేశారు.
ప్రస్తుతం రాష్ట్రపతి రేసులో ఉన్నారు. ఇక విపక్షాలకు సంబంధించి చూస్తే బీజేపీకి చెందిన మాజీ కేంద్ర మంత్రి , అపారమైన అనుభవం కలిగిన యశ్వంత్ సిన్హాను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. ఇ
ద్దరూ అభ్యర్థులు బీజేపీకి చెందిన వారే. ఇటీవల జరిగిన ఎన్నికల కంటే ముందు సిన్హా టీఎంసీలో చేరారు. ఆ పార్టీకి ఉపాధ్యక్షుడయ్యాడు.
ఆయన మొదట ఐఏఎస్ లో చేరారు. కొన్నేళ్లపాటు పలు పదవులు చేపట్టారు.
కేంద్ర ఆర్థిక మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం రాష్ట్రపతి రేసులో ఉన్నారు. మొత్తంగా చూస్తే రాష్ట్రపతి గా గెలవాలంటే బీజేపీ ఎన్డీయే సర్కార్ కు ఇంకా 8 వేలకు పైగా ఓట్లు కావాల్సి ఉంది.
ఏది ఏమైనా చక్రం తిప్పడంలో మోదీ తర్వాతే ఎవరైనా. ఏమో గుర్రం ఎగురావచ్చు. ద్రౌపది ముర్ము గెలవనూ వచ్చు కదూ.
Also Read : అడవి బిడ్డకు అరుదైన గౌరవం