Elon Musk Lays Off : ట్విట్టర్ లో 3,738 ఉద్యోగులకు ఝలక్
ఇమెయిల్ ద్వారా సమాచారం వెల్లడి
Elon Musk Lays Off : అంతా అనుకున్నట్టే జరుగుతోంది. టెస్లా సిఇఓ, చైర్మన్ ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను టేకోవర్ చేసుకున్నాక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ షాక్ ల మీద షాక్ ఇస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం ఉద్యోగుల పాలిట శాపంగా మారింది. ట్విట్టర్ ను రూ. 4,400 కోట్లకు పైగా ధర పెట్టి కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్ వెంట వెంటనే చర్యలు ప్రారంభించాడు.
రంగంలోకి దిగిన వెంటనే చీఫ్ ఎగ్జిక్యూటి ఆఫీసర్ పరాగ్ అగర్వాల్ , చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సెగెల్ , లీగల్ హెడ్ విజయా గద్దెతో పాటు టాప్ ఎగ్జిక్యూటీవ్ లను సాగనంపాడు. ఆ ముగ్గురికి $100 మిలియన్లు ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు ట్విట్టర్ లో మొత్తం 7,500 మంది ఉద్యోగులు ఉన్నారు.
వీరిలో 80 శాతానికి తగ్గించాలని ప్లాన్ చేస్తున్నాడు(Elon Musk Lays Off) . ఇప్పటికే ఆఫీసుకు వెళ్లే వాళ్లు తిరిగి ఇంటికి వెళ్లాలని సూచించింది ట్విట్టర్. ఈ మేరకు ఊహించని రీతిలో షాక్ ఇచ్చాడు ఎలాన్ మస్క్. ఇప్పుడు ట్విట్టర్ కు ఆయనే బాస్. ఇప్పటి వరకు ఉన్న ట్విట్టర్ బోర్డు డైరెక్టర్లపై వేటు వేశాడు.
3,738 మంది ఉద్యోగులకు సంస్థ ఇమెయిల్స్ ద్వారా సమాచారం ఇచ్చారు. కోలుకోలేని షాక్ కు గురి చేశారు. ప్రస్తుతం పని చేస్తున్న జాబర్స్ లో వణుకు మొదలైంది. ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకు వచ్చింది న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. కావాలని ఎలాన్ మస్క్ తమ పట్ల వ్యవహరిస్తున్నారంటూ ఉద్యోగులు వాపోతున్నారు.
మరో వైపు ట్విట్టర్ కో ఫౌండర్ డార్సీ ట్విట్టర్ కు ప్రత్యామ్నాయంగా బ్లూస్కీని తయారు చేసే పనిలో పడ్డారు.
Also Read : ఇలా జరుగుతుందని అనుకోలేదు – మనీష్