TV Somanathan : క్రిప్టో లావాదేవీల‌కు బిగ్ షాక్

క్లారిటీ ఇచ్చిన ఆర్థిక కార్య‌ద‌ర్శి

TV Somanathan  : ఇప్ప‌టి దాకా క్రిప్టో క‌రెన్సీ పై ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌ని కేంద్ర స‌ర్కార్ ఉన్న‌ట్టుండి బడ్జెట్ సంద‌ర్భంగా లావాదేవీల‌పై 30 శాతం ట్యాక్స్ విధిస్తామంటూ చెప్ప‌డం మార్కెట్ వ‌ర్గాలు జీర్ణించు కోలేక పోతున్నాయి.

ఈ దేశంలో ప్ర‌భుత్వం అన్న‌ది కేవ‌లం ప‌న్నుల వ‌సూలుకే ఉంద‌ని ప్ర‌జా ప్ర‌యోజ‌నాల‌ను ప‌ట్టించుకునే స్థితిలో లేద‌నే విమ‌ర్శ‌లు ఊపందుకున్నాయి.

ఇలా విధించ‌డం వ‌ల్ల క్రిప్టోకు మ‌ద్ద‌తు ఇచ్చిన‌ట్లా లేక పోతే దానిని క‌ట్ట‌డి చేసేందుకా అన్న‌ది క్లారిటీ ఇవ్వ‌లేక పోయారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్.

బ‌డ్జెట్ పూర్తిగా కార్పొరేట్ కంపెనీల‌కు ల‌బ్ది చేకూర్చేలా ఉంది త‌ప్ప ఇంకోటి లేకుండా పోయింది. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం అవుతున్న త‌రుణంలో క్లారిటీ ఇచ్చేందుకు ప్ర‌య‌త్నం చేశారు ఆర్థిక శాఖ కార్య‌ద‌ర్శి టీవీ సోమ‌నాథ‌న్(TV Somanathan).

ఇప్ప‌టికిప్పుడు క్రిప్టో క‌రెన్సీపై ఎలాంటి రూల్స్ రూపొందించ‌కుండా ప్ర‌త్యేక చ‌ట్టం తీసుకు రాకుండా 30 శాతం పన్ను విధించ‌డం దారుణం. అయితే సోమ‌నాథ‌న్ స్పందిస్తూ క్రిప్టో క‌రెన్సీ కొన‌డం, అమ్మ‌డం చ‌ట్ట వ్య‌తిరేకం కాద‌న్నారు.

గుర్ర‌పు పందేలు, బెట్టింగులు , ట్రాన్సాజ‌క్ష‌న్స్ పై ప‌న్నులు ఇప్ప‌టికే వ‌సూలు చేస్తున్నారు. ఇది కూడా అంతేనంటూ తేలిగ్గా కొట్టి పారేశారు సోమ‌నాథ‌న్. క్రిప్టో ఆస్తుల కోసం స్పెష‌ల్ గా ట్యాక్సేష‌న్ ఫ్రేమ్ వ‌ర్క్ ని వ‌ర్తింప చేస్తున్నామ‌ని చెప్పారు.

Also Read : త‌గ్గేదే లేదంటున్న గూగుల్

Leave A Reply

Your Email Id will not be published!