Bihar Political Crisis : గవర్నర్ ను కలవనున్న నితీష్ కుమార్
బీజేపీకి గుడ్ బై చెప్పనున్న జేడీయూ
Bihar Political Crisis : బీహార్ సీఎం నితీశ్ కుమార్ సారథ్యంలో మంగళవారం ఎమ్మెల్యేలు, ఎంపీలతో కీలక సమావేశం చేపట్టారు. జేడీయూ, భారతీయ జనతా పార్టీతో కూటమి మధ్య కొంత కాలంగా దూరం పెరుగుతూ వచ్చింది.
ఈ నేపథ్యంలో సీఎం గవర్నర్ తో సమయం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. మొత్తంగా నితీష్ కుమార్ మోదీతో తెగదెంపులు చేసుకోనున్నారు. ఇదిలా ఉండగా సీఎం నిర్ణయం కోసం వేచి చూస్తున్నామని బీజేపీ వెల్లడించింది.
ఆ పార్టీతో తెగదెంపులు చసుకోవడంపై(Bihar Political Crisis) ఊహాగానాలు తారా స్థాయికి చేరుకున్నాయి. కీలక భేటీ ప్రారంభమైంది. విచిత్రం ఏమిటంటే ప్రజా ప్రతినిధులకు చెందిన అందరి సెల్ ఫోన్లను సెక్యూరిటీ తీసుకున్నారు.
తనకు కలిసేందుకు గవర్నర్ సమయం ఇవ్వాలని కోరారు. ఇదిలా ఉండగా కూటమి మనుగడ సాగిస్తుందని ఆశించడం అంగీకరించ లేని ప్రాణాంతక రోగి కి చెందిన కుటుంబం లాంటిదని బీజేపీ పేర్కొనడం విశేషం.
నితీష్ కుమార్ అనేక సమస్యలపై బీజేపీతో తన కోపాన్ని బహిరంగ పరిచారు. ఇవాళ అధికార కూటమి మనుగడ సాగించ అవకాశం లేదని బీజేపీ, జేడీయూ వర్గాలు స్పష్టం చేశాయి.
ఆర్జేడీ నేతలు పార్టీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పాట్నా నివాసంలో సమావేశం అయ్యారు. వామపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా లాలూ ఇంటికి చేరుకున్నారు.
ఆర్జేడీతో పాటు కాంగ్రెస్ , హిందూస్తాన్ అవామ్ మోర్చా, సీపీఐఎంఎల్ కూడా నితీష్ కుమార్ కు మద్దతు తెలిపాయి. మొత్తంగా బీహార్ లో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది. మరి బీజేపీ ఏం చేస్తుందనే దానిపై చర్చ జరుగుతోంది.
Also Read : మరాఠా కేబినెట్ లో ఉండేదెవరో