Santosh Kumar Suman : బీహార్ సీఎంకు షాక్ మంత్రి గుడ్ బై

పార్టీ విలీనం కోసం ఒత్తిళ్లు

Santosh Kumar Suman : బీహార్ సంకీర్ణ స‌ర్కార్ కు కోలుకోలేని షాక్ త‌గిలింది. త‌మ పార్టీని విలీనం చేయాలంటూ తీవ్ర‌మైన ఒత్తిళ్లు వ‌స్తున్నాయ‌ని ఆరోపిస్తూ బీహార్ కేబినెట్ లో మంత్రిగా ప‌ని చేస్తున్న సంతోష్ కుమార్ సుమ‌న్ మంత్రివ‌ర్గానికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

రిజైన్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన మంత్రి ఎవ‌రో కాదు బీహాజీ సీఎం జితిన్ రామ్ మాంఝీ కుమారుడు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. నితీశ్ కుమార్ త‌మ పార్టీని జ‌న‌తాద‌ళ్ యునైటెడ్ పార్టీలో విలీనం చేయాలంటూ తీవ్ర‌మైన ఒత్తిడికి గురి చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు సంతోష్ కుమార్ సుమన్(Santosh Kumar Suman). త‌మ పార్టీ ఉనికికి ముప్పు ఏర్ప‌డింద‌ని, ఈ త‌రుణంలో మంత్రి ప‌ద‌వి కంటే త‌న‌కు పార్టీ ముఖ్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు.

దానిని కాపాడుకునేందుకే మంత్రి వ‌ర్గం నుంచి వైదొలిగిన‌ట్లు పేర్కొన్నారు. త‌మ‌ను క‌నీసం మంత్రివ‌ర్గ స‌మావేశానికి పిల‌వ లేద‌న్నారు. జూన్ 23న పాట్నాలో ప్ర‌తిప‌క్షాల‌తో కీల‌క‌మైన స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశాన్ని బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఏర్పాటు చేశారు. ఆయ‌న అన్ని పార్టీల‌ను ఏకం చేసే ప‌నిలో ప‌డ్డారు. హిందూస్తానీ అవామ్ మోర్చా (హామ్) హాజ‌ర‌వుతుందా లేదా అన్న‌ది ఇంకా తెలియాల్సి ఉంది.

అయితే త‌మ పార్టీ బీజేపీ సార‌థ్యంలోని ఎన్డీఏతో చేరే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. అధికార కూట‌మితోనే ప్ర‌యాణం సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు సంతోష్ కుమార్ సుమ‌న్.

Also Read : GV Prakash Music Director : >b> జీవీ సంగీతానికి చిరునామా

Leave A Reply

Your Email Id will not be published!