Bihar Political Crisis : జేడీయూ..ఆర్జేడీ మధ్య ఒప్పందం
తేజస్విని కలిసిన నితీష్ కుమార్
Bihar Political Crisis : బీహార్ రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడెక్కాయి(Bihar Political Crisis). గత కొంత కాలంగా బీజేపీకి జేడీయూకి మధ్య దూరం పెరిగింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా జోక్యం చేసుకోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.
మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే మోడల్ ఇక్కడ అమలు చేస్తారని అనుమానం వ్యక్తం చేశారు. ఇక కమలానికి కట్ చెప్పడం బెటర్ అని నిర్ణయానికి వచ్చేశారు. పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో అత్యవసర భేటీ నిర్వహించారు.
అనంతరం మధ్యాహ్నం గవర్నర్ ను కలిసి తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం అక్కడి నుంచి లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీతో జత కట్టేందుకు ఓకే చేశారు.
ఈ మేరకు తేజస్వి యాదవ్ ను నితీశ్ కుమార్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశానికి తేజస్వి తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలను కూడా కలవనున్నారు.
ఇద్దరి మధ్య ఒప్పందం కూడా కుదిరనట్లు సమాచారం. సీఎంగా నితీశ్ కుమార్. ఉప ముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్ ఉంటారని ఒప్పందం జరిగినట్లు టాక్.
కొత్త ప్రభుత్వ ఏర్పాటులో 32 ఏళ్ల ప్రతిపక్ష నేతగా ఉన్న తేజస్వి యాదవ్ వైపు మొగ్గు చూపారు నితీశ్ కుమార్. ఇక అన్ని కీలక శాఖలు ఎవరికి ఇవ్వాలనే దానిపై పూర్తి హక్కు సీఎం కు ఉండనుంది.
రాష్ట్రీయ జనతాదళ్ లేదా ఆర్జేడీ నుండి స్పీకర్ ను ఎంపిక చేయనున్నారు. కొత్త ప్రభుత్వంలో కాంగ్రెస్ తో పాటు వామపక్షాలు కూడా నితీష్ కుమార్ కు మద్దతు ఇస్తున్నారు.
Also Read : సీఎం పదవికి రాజీనామా చేస్తున్నా