Bihar Political Crisis : కాషాయ బంధానికి జేడీయూ కటీఫ్
బీహార్ లో వేడెక్కిన రాజకీయం
Bihar Political Crisis : బీహార్ లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి(Bihar Political Crisis). భారతీయ జనతా పార్టీతో ఇంత కాలం కొనసాగిస్తూ వస్తున్న బంధానికి చెక్ పెట్టేందుకు జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ నిర్ణయించారు.
ఈ మేరకు మంగళవారం ఎమ్మెల్యేలు, ఎంపీలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. గత కొంత కాలం నుంచి జేడీయూ, బీజేపీల మధ్య దూరం పెరిగింది. ప్రధాన మంత్రి మోదీ విందుకు పిలిచినా నితీశ్ కుమార్ వెళ్లలేదు.
తాజాగా ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ మీటింగ్ కు కూడా డుమ్మా కొట్టారు. కమలంతో దోస్తీ ఉన్నప్పటికీ ట్రబుల్ షూటర్ గా పేరొందిన కేంద్ర మంత్రి అమిత్ చంద్ర షా మితి మీరిన జోక్యం చేసుకోవడాన్ని తట్టుకోలేక పోయారు నితీశ్ కుమార్.
పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న ఆర్సీపీ సింగ్ కమలంతో టచ్ లో ఉండడాన్ని గమనించారు సీఎం. ఆయన కూడా పార్టీలో మరో ఏక్ నాథ్ షిండే లాగా మారనున్నారని ముందే పసిగట్టారు.
ఆ మేరకు మేలుకున్నారు. తనతో బంధం కొనసాగిస్తూనే తన పార్టీలోనే మరో వర్గాన్ని బీజేపీ అంతర్గతంగా తయారు చేయడాన్ని నమ్మక ద్రోహంగా భావించారు నితీశ్ కుమార్.
ఈ మేరకు కమలంతో కటీఫ్ చెప్పేందుకే దాదాపు డిసైడ్ అయ్యారు. తాజాగా ఆర్సీపీ సింగ్ సీఎంపై నిప్పులు చెరిగారు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించడంతో పార్టీలో కలకలం రేపింది.
ఇదే సమయంలో ఏఐసీసీ చీఫ్ సోనియా తో నితీష్ ఫోన్ లో మాట్లాడినట్లు సమాచారం. రాష్ట్రంలో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు టాక్.
ఆయా పార్టీలు కూడా తాము కలిసేందుకు సిద్దమని ప్రకటించాయి.
Also Read : దమ్ముంటే స్వంతంగా పోటీ చేయ్