Bilawal Bhutto : ఇక‌పై ఇమ్రాన్ ఖాన్ పీఎం కాదు

ప్ర‌తిపక్ష నేత బిలాల్ భుట్టో కామెంట్

Bilawal Bhutto : పాకిస్తాన్ ప్ర‌ధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ పై పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మ‌న్ భుట్టో నిప్పులు చెరిగారు. పీఎంగా ఆయ‌న ఒక్క నిమిషం ఆ ప‌ద‌విలో ఉండేందుకు అర్హుడు కాడ‌న్నారు.

ఆయ‌న పూర్తి మెజారిటీని కోల్పోయార‌ని, అటు చ‌ట్ట స‌భ‌లోనే కాదు దేశంలో కూడా ప్ర‌జ‌ల విశ్వాసాన్ని కోల్పోయాడ‌ని ఆరోపించారు. వెంట‌నే ప‌ద‌వి నుంచి త‌ప్పు కోవాల‌ని బిలాల్ భుట్టో(Bilawal Bhutto) డిమాండ్ చేశారు.

ఇదిలా ఉండ‌గా ఇమ్రాన్ ఖాన్ ప్ర‌ధాని ప‌ద‌వి నుంచి దింపేందుకు ప్ర‌తిప‌క్షాల‌తో చేతులు క‌లిపి త‌మ‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని అనుకున్నందుకు తాము కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

ఇవాళ బిలాల్ భుట్టో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను ఇంకా ప‌ద‌విని ప‌ట్టుకుని వేలాడ‌డం దారుణ‌మ‌న్నారు. ఏ మాత్రం నైతిక విలువులు ఉన్న వ్య‌క్తి అయితే ఇప్ప‌టి వ‌ర‌కు త‌ప్పు కోక పోవ‌డం మంచిది కాద‌ని పేర్కొన్నారు బిలాల్ భుట్టో(Bilawal Bhutto).

ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు షాబాజ్ ష‌రీఫ్ త్వ‌ర‌లో ప్ర‌ధాన‌మంత్రి అవుతార‌ని స్ప‌ష్టం చేశారు. ఇమ్రాన్ ఖాన్ గ‌ద్దె దిగ‌డం ఖాయ‌మ‌న్నారు.

ఈ మేర‌కు ఎంక్యూఎం పీ పార్టీకి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అవిశ్వాస తీర్మానం త‌ప్ప‌నిస‌రిగా నిర్వహించాల‌ని బిలాల్ భుట్టో డిమాండ్ చేశారు స్పీక‌ర్ ను.

ఆయ‌న పార్టీకి చెందిన స‌భ్యులు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చారు. మిత్ర‌ప‌క్షాల‌కు చెందిన 23 మంది గుడ్ బై చెప్పారు. గురువారం జ‌రిగే మీటింగ్ లో అస‌లైన విష‌యం తేలుతుంద‌న్నారు బిలాల్ భుట్టో.

అయితే స‌మాచార శాఖ మంత్రి ఫ‌వాద్ చౌద‌రి మాత్రం ఆఖ‌రి బంతి వ‌ర‌కు ఇమ్రాన్ ఖాన్ ఉంటాడ‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : ఇమ్రాన్ ద‌మ్ముంటే అధికారం నిల‌బెట్టుకో

Leave A Reply

Your Email Id will not be published!