Bilawal Bhutto : దివంగత బెనజీర్ భుట్టో తనయుడు బిలావల్ భుట్టో జర్దారీ పాకిస్తాన్ కొత్త విదేశాంగ శాఖ మంత్రిగా నియమితులయ్యారు. ఇవాన్ ఇ సదర్ ( ప్రెసిడెంట్ హౌస్ ) లో జరిగిన సాధారణ కార్యక్రమంలో 33 ఏళ్ల బిలావల్ భుట్టో జర్దారీతో పాకిస్తాన్ చీఫ్ ఆరిఫ్ అల్వీ ప్రమాణ స్వీకారం చేయించారు.
అమెరికాతో తెగతెంపులు చేసుకున్న సంబంధాలను సరిదిద్దు కోవడం వంటి బహుళ సవాళ్లను ఎదుర్కొంటున్న కీలక సమయంలో ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం కీలక పదవి అప్పగించింది.
పాకిస్తాన్ లోని ప్రముఖ రాజకీయ రాజ వంశానికి చెందిన బిలావల్ భుట్టోను(Bilawal Bhutto) వరించింది. ఆయన షెహబాజ్ షరీఫ్ తో కలిసి పోరాడారు. ఇమ్రాన్ ఖాన్ కు వ్యతిరేకంగా నిరసన గళం వినిపించారు.
ఈ తరుణంలో ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టడంలో కీలక పాత్ర పోషించారు. ఆయనతో పాటు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు మరియమ్ షరీఫ్ తో కలిసి ఉద్యమించారు.
ఈ తరుణంలో ఖాన్ దిగి పోవడం షరీఫ్ నూతన ప్రధానిగా ఎన్నిక కావడం జరిగి పోయింది. ఈ తరుణంలో అత్యంత కీలకమైన విదేశాంగ శాఖ అప్పగించడం విశేషం.
చిన్న వయసులోనే విద్యాధికుడు కావడం, దేశం పట్ల అవగాహన కలిగి ఉండడం, విదేశాలతో సత్ సంబంధాలు నెరపడం వంటి వాటిలో ఆరి తేరారు బిలావల్ భుట్టో(Bilawal Bhutto).
పొరుగునే ఉన్న భారత్ తో బంధం కొనసాగిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఇదిలా ఉండగా బిలావల్ కు ప్రభుత్వంలో కీలక పదవిని ఇవ్వవడంతో పాటు దేశ విదేశాంగ మంత్రిగా కీలక శాఖను కేటాయించడం ఇదే తొలిసారి.
2018 లో తొలిసారిగా బిలావల్ భుట్టో జాతీయ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
Also Read : ఆంగ్ సాన్ సూకీకి 5 ఏళ్ల జైలు శిక్ష