Bill Gates Modi : ఆరోగ్య రంగంలో భారత్ కృషి భేష్
ప్రధాని మోదీతో బిల్ గేట్స్ కామెంట్స్
Bill Gates Modi : డిజిటల్ టెక్నాలజీని వినియోగించడంలో భారత్ కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ , బిల్ గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్. ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో(Bill Gates Modi) ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక అంశాలపై చర్చించారు ఇరువురు. భారత దేశం గురించి ఎప్పుడూ లేని ఆశావాదం కనిపిస్తోందన్నారు. ఆరోగ్య రంగంలో భారత్ ముందంజలో ఉందన్నారు. కీలకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టడం బాగుందని కితాబు ఇచ్చారు బిల్ గేట్స్.
జి20 నాయకత్వంతో పాటు ఇతర కీలక అంశాలపై విస్తృతంగా అభిప్రాయాలను పంచుకున్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు టెక్ దిగ్గజం. చాలా సురక్షితమైన, ప్రభావంతంమైన , సరసమైన వ్యాక్సిన్లను తయారు చేయగల అద్భుతమైన సామర్థ్యం కోసం భారత దేశాన్ని ప్రశంసించారు. వాటిలో కొన్ని గేట్స్ ఫౌండేషన్ మద్దతు తెలుపుతోంది. ఈ వ్యాక్సిన్లు మిలియన్ల మందిని ప్రాణాలు పోకుండా కాపాడాయని తెలిపారు.
కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి జీవం పోశాయని పేర్కొన్నారు బిల్ గేట్స్(Bill Gates). జీవన రక్షణ టూల్స్ ను ఉత్పత్తి చేయడంతో పాటు వాటిని డెలివరీ చేయడంలో భారత దేశం కూడా రాణిస్తోందన్నారు. 2.2 బిలియన్ల కంటే ఎక్కువ కోవిడ్ వ్యాక్సిన్లను సరఫరా చేసిందని కితాబు ఇచ్చారు బిల్ గేట్స్. ఈ సందర్భంగా బిల్ గేట్స్ ఫౌండేషన్ అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు పీఎం నరేంద్ర మోదీ.
మహమ్మారి సమయంలో డిజిటల్ చెల్లింపులను స్వీకరించేందుకు మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read : మౌలిక సదుపాయాలు అభివృద్దికి దారులు