N Biren Singh : మ‌ణిపూర్ సీఎంగా బీరేన్ సింగ్

ప్ర‌క‌టించిన బీజేపీ అధిష్టానం

N Biren Singh : ప‌ది రోజుల ఉత్కంఠ‌కు తెర దించింది భార‌తీయ జ‌న‌తా పార్టీ అధిష్టానం. మ‌ణిపూర్ రాష్ట్రానికి రెండోసారి సీఎంగా ఎన్. బీరేన్ సింగ్ (N Biren Singh)ను నియ‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

దీంతో గ‌త కొన్ని రోజులుగా న‌డుస్తూ వ‌స్తున్న స‌స్పెన్స్ కు పుల్ స్టాప్ పెట్టింది. ఆయ‌న రెండోసారి సీఎంగా కొలువు తీర‌నున్నారు. బీరేన్ సింగ్ విష‌యానికి వ‌స్తే ఆయ‌న ఫుట్ బాల్ క్రీడాకారుడు, బీఎస్ఎఫ్ జ‌వాన్, జ‌ర్న‌లిస్ట్ గా గ‌తంలో ప‌ని చేశారు.

సీఎంగా ఆయ‌న నేతృత్వంలోనే ఈసారి రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌రిగాయి. మిగ‌తా మూడు రాష్ట్రాల‌లో సీఎం అభ్య‌ర్థుల ఎంపిక ఈజీగానే జ‌రిగింది. కానీ మ‌ణిపూర్ వ‌ర‌కు వ‌చ్చేసరిక‌ల్లా కొంత ఆలస్యం అయ్యింది.

ప‌ద‌వి రేసులో బిస్వ‌జిత్ సింగ్ కూడా పోటీ ప‌డ్డారు. మ‌ధ్యే మార్గంగా బీజేపీ అనుబంధ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ కు చెందిన‌, స్పీక‌ర్ గా ప‌ని చేసిన ఖేమ్ చాంద్ ను కూడా ప‌రిశీలించింది బీజేపీ హైక‌మాండ్.

కానీ పార్టీని స‌క్సెస్ బాట‌లో న‌డిపిన ఎన్. బీరేన్ సింగ్ వైపు మొగ్గు చూపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్, న్యాయ శాఖ మంత్రి కిర‌న్ రిజిజు ఇంఫాల్ కు ఇవాళ వెళ్లారు.

అక్క‌డ ప్ర‌త్యేకంగా స‌మావేశం అయ్యారు. కేంద్ర ప‌రిశీల‌కుల నేతృత్వంలో బీజేపీ శాస‌న‌స‌భా ప‌క్ష స‌మావేశం జ‌రిగింది. స‌భ్యులంతా ఏక‌గ్రీవంగా ఎన్. బీరేన్ సింగ్ ను త‌మ ప‌క్ష నేతగా ఎన్నుకున్నారు.

దీంతో రెండోసారి సింగ్ కింగ్ (N Biren Singh)గా మార‌నున్నారు. సీఎంగా కొలువు తీర‌నున్నారు.

Also Read : ప్ర‌జ‌లు కోరితే మంత్రిని తొల‌గిస్తాం

Leave A Reply

Your Email Id will not be published!