BJP NEC Meeting : కీలక తీర్మానాలకు బీజేపీ ఆమోదం
ముగిసిన జాతీయ కార్యవర్గ సమావేశం
BJP NEC Meeting : భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం తొలి రోజు ముగిసింది. ఈ కీలక సమావేశంలో ప్రధానంగా ఆర్థిక, రాజకీయ తీర్మానాలను ప్రవేశ పెట్టారు. పార్టీకి సంబంధించి రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆర్థిక తీర్మానం ప్రవేశ పెట్టారు.
పార్టీకి సంబంధించిన ఖర్చులు, ఆస్తులు, విరాళాలపై ప్రధానంగా చర్చించారు. అంతే కాకుండా రానున్న అసెంబ్లీ ఎన్నికలపై కూడా ప్రత్యేకంగా చర్చించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలలో పార్టీ పరిస్థితిపై సమీక్ష(BJP NEC Meeting) నిర్వహించారు.
హెచ్ఐసీసీలో ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, దేశంలోని 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు, పార్టీకి చెందిన బాధ్యులు, కీలక నేతలు, ఎంపీలు, పదాధికారులు హాజరయ్యారు.
రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరుగనున్నాయి. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చించారు.
ఇక ప్రధాన మంత్రి రెండు రోజుల పాటు ఇక్కడే బస చేస్తారు. ఆయనకు ప్రత్యేకంగా రాజ్ భవన్ లో విడిది ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం 10 గంటల నుండి 4.30 గంటల దాకా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొంటారు మోదీ.
అనంతరం సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. ఇప్పటికే హైదారాద్ మొత్తం పోలీసులతో నిండి పోయింది.
Also Read : హైదరాబాద్ అద్భుతమైన నగరం – మోదీ