BJP Bus Yatra: ఫిబ్రవరి 10 నుండి తెలంగాణాలో బీజేపీ బస్సు యాత్ర !

ఫిబ్రవరి 10 నుండి తెలంగాణాలో బీజేపీ బస్సు యాత్ర !

BJP Bus Yatra: తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోవడంతో త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలపై బీజేపి ఫోకస్ పెట్టింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక స్థానంతో సరిపెట్టుకున్న బీజేపీ… 2023 ఎన్నికల్లో 8 స్థానాలను కైవసం చేసుకుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితం రాకపోయినప్పటికీ… 35 శాతం ఓట్ షేర్ సాధించింది. దీనితో మరికొన్ని రోజుల్లో రానున్న లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 10 నుండి 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించేందుకు బీజేపీ(BJP) అగ్రనాయకత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ బస్సుయాత్రలో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్ తో పాటు బహిరంగ సభలు కూడా ఉండేటా రూట్ మ్యాప్ ను సిద్ధం చేస్తున్నారు. ఈ బస్సుయాత్రలో రాష్ట్ర నాయకులతో పాటు పలువరు జాతీయ నాయకులు కూడా పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.

BJP Bus Yatra Updates

ఫిబ్రవరి 10 నుండి చేపట్టబోయే బస్సు యాత్రకు… రాష్ట్ర నాయకత్వం పకడ్బందీగా రూట్ మ్యాప్ ను సిద్ధం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలను నాలుగు క్లష్టర్స్ గా విభజించింది. నాలుగు క్లష్టర్స్ లో 11 రోజుల పాటు బస్సు యాత్ర నిర్వహించే విధంగా రూట్ మ్యాప్ ను రూపొందిస్తోంది. రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు, బహిరంగ సభల్లో రాష్ట్ర నాయకులతో పాటు జాతీయ నాయకులు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తుంది.

Also Read : Digital Health Profile: డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ తయారీకు తెలంగాణా ప్రభుత్వం కసరత్తు !

Leave A Reply

Your Email Id will not be published!