BJP Cabinet Meeting : బీజేపీ కేబినెట్ కీలక భేటీ
కిషణ్ రెడ్డి గైర్హాజర్
BJP Cabinet Meeting : భారతీయ జనతా పార్టీ కేంద్ర కేబినెట్ కీలక సమావేశం ముగిసింది. ఈ కీలక భేటీ గంటన్నరకు పైగా కొనసాగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గైర్హాజరయ్యరు. ఆయనను మంత్రి వర్గం నుంచి తప్పించినట్టు సమాచారం. ఆయన స్థానంలో ఎవరిని నియమిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి పవర్ లోకి రావాలని యోచిస్తోంది బీజేపీ.
ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంది పార్టీ పరంగా. ఐదు రాష్ట్రాలలో పార్టీ అధ్యక్షులను మార్చింది. పంజాబ్ కు జక్కర్ , జార్ఖండ్ కు మరాండీ, ఏపీకి భువనేశ్వరి దేవి, తెలంగాణకు బండిని తప్పించి కిషన్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చింది. రాబోయే మరికొన్ని రోజుల్లో ఆరు రాష్ట్రాలకు సంబంధించి పార్టీ అధ్యక్షులను మార్చాలని కూడా నిర్ణయించినట్లు సమాచారం.
ఇక కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్న గంగాపురం కిషన్ రెడ్డి ఇంకా తన పదవికి రాజీనామా చేయలేదు. ఈ తరుణంలో ఆయన మంత్రివర్గం సమావేశానికి హాజరు కావాల్సి ఉంది. కానీ హాజరు కాక పోవడం వెనుక గల కారణాలు ఏంటి అనేది ఇంకా తెలియ రాలేదు. నిన్న బీజేపీ(BJP) జాతీయ అధ్యక్షుడు జజేపీ నడ్డా కీలక ప్రకటన చేశారు.
బండి సంజయ్ కు బిగ్ షాక్ ఇచ్చింది. ఆయన స్థానంలో కిషన్ రెడ్డికి ఛాన్స్ ఇస్తున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో మరో సీనియర్ నాయకుడు ఈటల రాజేందర్ కు ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా అప్పగించింది. కిరణ్ కుమార్ రెడ్డికి జాతీయ స్థాయి కార్యవర్గ సభ్యుడిగా నియమించింది.
Also Read : Raghunandan Rao : రఘునందన్ ఆడియో లీక్ వైరల్
