Bandi Sanjay : బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్
కార్యకర్తల అరెస్ట్ పై ఆగ్రహం
Bandi Sanjay : కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టిన బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ పటేల్(Bandi Sanjay) ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన నిర్బంధంలో ఉన్నారు.
పార్టీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ అరెస్ట్ చేసిన విషయాన్ని ధ్రువీకరించారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ జనగామ జిల్లాలో పర్యటిస్తున్నారు.
తెలంగాణ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో బీజేపీ కార్యకర్తల అరెస్ట్ కు వ్యతిరేకంగా బండి సంజయ్ నిరసన చేపట్టారని తెలిపారు.
ఇదిలా ఉండగా లిక్కర్ స్కామ్ లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం కేసీఆర్ తనయురాలు ఎమ్మెల్సీ కవితను వెంటనే అరెస్ట్ చేయాలంటూ బీజేపీ ఆధ్వర్యంలో కార్యకర్తలు, నాయకులు ఆమె ఇంటిని ముట్టడించారు.
ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నం చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీనిని నిరసిస్తూ బండి సంజయ్ కుమార్ పటేల్ ధర్మ దీక్ష చేపట్టారు.
అంతకు ముందు మహ్మద్ ప్రవక్తపై దైవ దూషణలు చేశారంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ను హైదరాబాద్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.
సౌత్ జోన్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 153ఏ, 295, 505 కింద దబీర్ పురా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం గోషా మహల్ ఎమ్మెల్యేగా ఉన్నారు రాజా సింగ్.
కాగా తాను స్టాండ్ అప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ పై కామెంట్స్ చేశానని కానీ ప్రవక్తపై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్నారు రాజాసింగ్.
Also Read : రాజకీయ లబ్ది కోసమే బీజేపీ రెచ్చగొడుతోంది