తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నా పత్రాల లీకేజీల వ్యవహారం రాజకీయ రంగు పులుకుముంది. ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీలో చోటు చేసుకున్న పరిణామాలపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. మరో వైపు 10వ తరగతి ప్రశ్నా పత్రం లీకేజీలో కీలక పాత్ర ఉందంటూ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ని పోలీసులు అరెస్ట్ చేయడం, ఆ తర్వాత బెయిల్ పై బయటకు రావడం జరిగింది. ఇదే సమయంలో పీఎం రాకతో మరింత కాకా రేపింది.
సీపీ రంగనాథ్ తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆయనపై కోర్టుకు వెళతానంటూ కీలక ప్రకటన చేశారు బండి సంజయ్. ఈ తరుణంలో ఆయనను విచారించేందుకు కస్టడీ అనుమతి కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హన్మకొండ కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఇప్పటికి విచారణ చేపట్టింది చాలు..కస్టడీ అవసరం లేదని బండి సంజయ్ తరపు న్యాయవాదుల వాదన వైపు మొగ్గు చూపింది. కస్టడీ పిటీషన్ ను డిస్మిస్ చేస్తూ తీర్పు చెప్పింది.
ఓ వైపు లక్షలాది మంది జీవితాలతో ఆటాడుకున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ , సభ్యులు, సెక్రటరీని ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారనేది తెలియాల్సి ఉందని బండి సంజయ్ అన్నారు. ఆయనతో పాటు బీఎస్పీ చీఫ్ కూడా పదే పదే ప్రస్తావిస్తున్నారు. 10వ తరగతిలో దూకుడు ప్రదర్శించిన పోలీసులు ఎందుకని టీఎస్పీఎస్సీ పేపర్ లీకులో వివరాలు వెల్లడించడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు.