Maharashtra BJP Chief : రాజ్ థాకరేతో బీజేపీ చీఫ్ సమావేశం
బీఎంసీ ఎన్నికలపై విస్తృత చర్చలు
Maharashtra BJP Chief : మహారాష్ట్రలో రాజకీయాలు మరింత వేడిని రాజేస్తున్నాయి. ఇప్పటికే శివసేనపై తిరుగుబాటు జెండా ఎగుర వేసి కొత్త సర్కార్ ను ఏర్పాటు చేసిన సీఎం ఏక్ నాథ్ షిండే(Eknath Shinde), డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.
ప్రధానంగా బాల్ థాకరే స్థాపించిన శివసేనను నామ రూపాలు లేకుండా చేయాలన్నది భారతీయ జనతా పార్టీ కల. అందులో భాగంగానే విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రేను విభేదిస్తూ వస్తున్న మహా రాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ థాకరే తో డిప్యూటీ సీఎంగా కొలువు తీరిన వెంటనే దేవేంద్ర ఫడ్నవీస్ భేటీ అయ్యారు.
తమ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిందిగా ఆయన కోరారు. ఈ మేరకు రాజ్ థాకరే సమ్మతించారు. ఇదే సమయంలో తాజాగా భారతీయ జనతా పార్టీ చీఫ్ చంద్రశేఖర్ బవాన్ కులే(Maharashtra BJP Chief) భేటీ అయ్యారు.
ఈ సందర్బంగా మహారాష్ట్రతో పాటు దేశంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల గురించి ప్రత్యేకంగా చర్చించినట్లు బవాన్ కులే వెల్లడించారు. ప్రస్తుతం వీరిద్దరూ భేటీ కావడం ఆసక్తిని రేపింది. చర్చకు దారితీసింది.
సామాజిక, రాజకీయ అంశాలపై ఎక్కువ ఫోకస్ పెట్టామన్నారు. త్వరలో ముంబై నగర పాలక సంస్థకు సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. జెండా ఎగుర వేయాలన్నది ఇరు పార్టీల ఆలోచన.
ఇదిలా ఉండగా 2017లో 227 మంది సభ్యులున్న బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో 82 సీట్లు గెలుచుకుంది బీజేపీ. కాగా శివసేన పార్టీ కంటే రెండు స్థానాలు తక్కువగా ఉన్నాయి.
Also Read : జేపీ నడ్డాతో మధ్యప్రదేశ్ సీఎం భేటీ