Rahul Gandhi : బీజేపీ కామెంట్స్ రాహుల్ సీరియస్
న్యాయ వ్యవస్థపై ఒత్తిడి ఎలా చేస్తాం
Rahul Gandhi BJP : కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిరెన్ రిజిజు తో పాటు బీజేపీ నేతలు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు. న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెస్తున్నారంటూ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి దేశం కంటే కుటుంబమే ముఖ్యమని ఎద్దేవా చేశారు. ఈ తరుణంలో మంగళవారం రాహుల్ గాంధీ(Rahul Gandhi BJP) ఏఐసీసీ కార్యాలయంలో త్వరలో జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై సమీక్ష చేపట్టారు.
ఎవరికి టికెట్లు ఇవ్వాలనే దానిపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తో పాటు కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. అంతకు ముందు రాహుల్ గాంధీ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడారు.
పలువురు పార్టీ నేతలతో కలిసి గుజరాత్ కోర్టుకు హాజరు కావడంపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఇదంతా బెదిరింపులో భాగమని పేర్కొనడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు రాహుల్ గాంధీ.
న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందన్నారు. తాను ధర్మాన్ని పాటిస్తానని, చివరకు సత్యమే నిలుస్తుందని నమ్ముతానంటూ స్పష్టం చేశారు. సమస్యలను ప్రస్తావించడమే తప్ప వ్యవస్థలను నిర్వీర్యం చేసేంత స్థాయికి ఇంకా దిగజారలేదన్నారు.
ఈ దేశంలో ఎవరు ఏం చేస్తున్నారో తనకంటే ప్రజలకు, న్యాయ వ్యవస్థకు బాగా తెలుసన్నారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). మీరంతా బీజేపీ చెప్పింది మాత్రమే వింటారు. కానీ తాము చెప్పింది కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
Also Read : అవినీతి పరుల్ని రక్షిస్తున్నది ఎవరు