Sudlin Dhavalikar : కొద్ది గంటల్లో దేశంలోని ఐదు రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ తరుణంలో అన్ని ఎగ్జిట్ పోల్స్ గోవా రాష్ట్రంలో హంగ్ ఏర్పాటు అయ్యే ఛాన్స్ ఉందంటూ పేర్కొన్నాయి.
ఇప్పటికే పవర్ లో ఉన్న భారతీయ జనతా పార్టీ తో పాటు కాంగ్రెస్ పార్టీ సైతం ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమ పార్టీల అభ్యర్థుల పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులను కాపాడుకునే పనిలో పడ్డాయి.
కాంగ్రెస్ పార్టీ తమ వారిని రిసార్టులకు తరలించింది. గతంలో మెజారిటీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ పవర్ లోకి రాబట్టుకోలేక పోయింది. దీనిని అవకాశంగా తీసుకుని కాషాయం అధికారంలోకి వచ్చింది.
ప్రస్తుతం త్రిముఖ పోటీ నెలకొంది. అయితే కాంగ్రెస్ పార్టీ చిన్న చిన్న పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులతో సంప్రదింపులు జరుపుతోంది.
ఇదే సమయంలో బీజేపీ సైతం గాలం వేసే పనిలో పడింది. హంగ్ ఏర్పడుతుందన్న అంచనా నేపథ్యంలో గోవా రాష్ట్రంలో కీలకంగా మారింది మహారాష్ట్ర గోమంతక్ పార్టీ.
ఈసారి ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, ఎంజీపీ, ఆప్, టీఎంసీ బరిలో ఉన్నాయి. ఇవాళ ఎంజీపీకి సీనియర్ నాయకుడు సుధీన్ ధవలికర్(Sudlin Dhavalikar) మాట్లాడారు. ఓ వైపు కాంగ్రెస్ పార్టీ ఇంకో వైపు బీజేపీ తమతో టచ్ లో ఉన్నాయని చెప్పారు.
ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తాము ఎవరికి మద్దతు ఇస్తామనేది ఇప్పుడే చెప్పలేనని అన్నారు. రేపు వెల్లడయ్యే ఫలితాలను బట్టి ఉంటుందని స్పష్టం చేశారు ధవలికర్ .
Also Read : ఒకవేళ సీఎం నైనా సామాన్యుడినే