BJP Focus Telangana : ‘కాషాయం’ లక్ష్యం పార్టీ బలోపేతం
ఫిబ్రవరి 5 నుంచి కార్నర్ మీటింగ్స్
BJP Focus Telangana : దేశంలో తొమ్మిది రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి భారతీయ జనతా పార్టీ భారీ స్థాయిలో స్కెచ్ వేసింది. ఎలాగైనా సరే అన్నింటా కాషాయ జెండా ఎగుర వేయాలని పావులు కదుపుతోంది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజుల పాటు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించింది. కీలక నిర్ణయాలు తీసుకుంది.
ప్రత్యేకించి దక్షిణాదిన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళపై ఫోకస్ పెడుతోంది. ఇదే సమయంలో కర్ణాటకలో కొలువు తీరిన బీజేపీ మరోసారి పవర్ లోకి రావాలని ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ప్రతి రాష్ట్రంలో గుజరాత్ లో ఇటీవల వచ్చిన రిజల్ట్స్ రిపీట్ కావాలని ఇప్పటికే దిశా నిర్దేశం చేశారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.
కార్యవర్గ సమావేశాన్ని ఉద్ధేశించి ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ గంటా 20 నిమిషాలకు పైగా ప్రసంగించారు. తెలంగాణలో బీజేపీ టాప్ లో ఉందని , పార్టీ చీఫ్ బండి సంజయ్ కి కితాబు(BJP Focus Telangana) ఇచ్చారు. ప్రధానంగా ఈసారి భారత రాష్ట్ర సమితిని ఓడించాలని ఆదేశించారు.
దీంతో అధికారమే లక్ష్యంగా బీజేపీ కార్నర్ మీటింగ్స్ కు రెడీ అవుతోంది. ఫిబ్రవరి 5 నుంచి 20 దాకా నిర్వహించాలని నిర్ణయించింది. మిషన్ 90లో భాగంగా గడప గడపకు బీజేపీని తీసుకు వెళ్లాలని స్పష్టం చేసింది. స్థానిక స్థాయిలో వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, గ్రామ సర్పంచ్ లు సైతం ఆకర్షించి వారిని బీజేపీలో చేర్చుకునేలా చేసేందుకు బీజేపీ వ్యూహం పన్నుతోంది.
Also Read : డీజీపీ ఎంపికపై హైకోర్టు తీర్పు