BJP SG Surya : బీజేపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సూర్య అరెస్ట్

త‌మిళ‌నాడులో ముదిరిన వివాదం

BJP SG Surya : త‌మిళ‌నాడులో అరెస్ట్ ల ప‌ర్వం కొన‌సాగుతోంది. మ‌నీ లాండ‌రింగ్ వ్య‌వ‌హారంలో మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ అదుపులోకి తీసుకుంది. దీనిని తీవ్రంగా ఖండించింది డీఎంకే. సెంథిల్ కు అక‌స్మాత్తుగా ఛాతిలో నొప్పి రావ‌డం, ఆస్ప‌త్రిలో చేర‌డంపై ఎద్దేవా చేసింది బీజేపీ. ఈ మేర‌కు ఇదంతా నాట‌కం త‌ప్ప మ‌రొక‌టి కాద‌ని మండిప‌డ్డారు బీజేపీ స్టేట్ చీఫ్ కె. అన్నామ‌లై.

తాజాగా పారిశుధ్య కార్మికుడి మృతిపై మ‌ధురై సీఎంపీకు చెందిన ఎంపీ మౌనం వ‌హించడాన్ని ప్ర‌శ్నించారు భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎస్జీ సూర్య‌. ఆయ‌న ట్విట్ట‌ర్ లో ట్వీట్ చేశారు. దీనిపై పోలీసులు సూర్య పై కేసు న‌మోదు చేసి అరెస్ట్ చేశారు.

మ‌ధురై జిల్లా సైబ‌ర్ క్రైమ్ పోలీసులు జూన్ 16న శుక్ర‌వారం చెన్నైలో అదుపులోకి తీసుకున్నారు. అయితే అరెస్ట్ చేసేందుకు గ‌ల కార‌ణాలు ఇప్ప‌టికు వెల్ల‌డించ లేదు పోలీసులు. సీపీఎం ఎంపీ వెంక‌టేశ‌న్ పై నిప్పులు చెరుగుతూ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆరోపించారు ఎస్జీ సూర్య‌(SG Surya).

సీపీఎంకు చెందిన కౌన్సిల‌ర్ వ‌ల్ల‌నే కార్మికుడు చ‌ని పోయాడ‌ని, దీనికి ఎంపీ కార‌ణ‌మంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. దీనిపై ఫిర్యాదు అంద‌డంతో రంగంలోకి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగారు.

Also Read : PM Modi Lauds Falu : ఫాలు మిల్లెట్స్ పాట‌కు మోదీ ఫిదా

 

Leave A Reply

Your Email Id will not be published!