BJP High Command : కాషాయ నేతలకు హైకమాండ్ పిలుపు
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కూడా పిలుపు
BJP High Command : తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పవర్ లోకి రావాలని ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా నిరంతర కార్యక్రమాలతో హోరెత్తిస్తోంది. కాగా బీజేపీలో కీలక నేతలుగా ఉన్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్ , మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు కొన్ని రోజులుగా పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. దీనిపై వారిద్దరి మౌనం ఎందుకనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఆ ఇద్దరినీ తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్లు సమాచారం.
దీంతో పార్టీకి పెద్ద దిక్కుగా అటు కేంద్రంతో ఇటు రాష్ట్రంలో చక్రం తిప్పుతున్న కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డిని వెంటనే ఢిల్లీకి రావాల్సిందిగా బీజేపీ(BJP) హై కమాండ్ ఆదేశించినట్లు సమాచారం. ఆయనతో పాటు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు కూడా హాజరు కావాలని ఫోన్ చేయడంతో వారిద్దరూ ఢిల్లీ బాట పట్టారు.
ఓ వైపు పార్టీ చీఫ్ బండి సంజయ్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. బీజేపీ ఇంటింటికీ కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. ఆయన కూడా ఢిల్లీకి వెళ్లి వచ్చారు. అయినా ఈ ఇద్దరు కీలక నేతలు ఎందుకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని బీజేపీ అధిష్టానం ఆరా తీసినట్లు టాక్. తాను వెళుతున్న విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కన్ ఫర్మ్ చేశారు. ఈ ముగ్గురితో శనివారం సాయంత్రం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా, పార్టీ చీఫ్ జేపీ నడ్డాతో ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు సమాచారం.
Also Read : Tirumala Rush : భక్తుల రద్దీతో తిరుమల కిటకిట