BJP Telangana : దేశంలోని ఐదు రాష్ట్రాలలో ఎన్నికల పర్వం ముగిసింది. బీజేపీ నాలుగు రాష్ట్రాలలో కాషాయ జెండా (BJP Telangana )ఎగుర వేసింది. దీంతో భారతీయ జనతా పార్టీ హైకమాండ్ ప్రధానంగా తెలంగాణపై పట్టు కోసం ఫోకస్ పెట్టనుంది.
ఇందు కోసం విస్తృతంగా సభలు, సమావేశాలు విస్తృతంగా చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈనెల చివరి వారంలో కానీ లేదా ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో జనగాంలో భారీ బహిరంగ సభ చేపట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
ఈ సభకు ట్రబుల్ షూటర్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, పార్టీ చీఫ్ జేపీ నడ్డా, సీఎం యోగి ఆదిత్యానాథ్ హాజరు కానున్నారు.
ఇదిలా ఉండగా బీజేపీ తెలంగాణ స్టేట్ చీఫ్ , కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పటేల్ ఏప్రిల్ 14న ఉమ్మడి పాలమూరు జిల్లా ఆలంపూర్ లోని జోగులాంబ అమ్మ వారి ఆలయం నుంచి ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
దీనికి అమిత్ షా హాజరు కానున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా రెండు రోజుల పాటు ఆయన తెలంగాణలోనే (BJP Telangana )మకాం వేయనున్నట్లు టాక్. బూత్ లెవల్ కార్యకర్తలతో ఆయన సమావేశం అవుతారు.
ఆయా పార్టీలకు చెందిన వారు, టికెట్లు రావని అనుకుంటున్న వాళ్లు, అసంతృప్తులు పలువురు భారతీయ జనతా పార్టీ నాయకత్వంతో టచ్ లో ఉన్నట్టు సమాచారం.
వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలు ఎవరనే దానిపై పూర్తి నివేదికను సార్ కు ఇస్తారని సమాచారం.
Also Read : సీడబ్ల్యూసీ సమావేశం గరం గరం