Arvind Kejriwal : బీజేపీ నైజం గూండాయిజం – కేజ్రీవాల్

నిప్పులు చెరిగిన ఢిల్లీ సీఎం

Arvind Kejriwal Slams BJP : ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ నిప్పులు చెరిగారు. అర‌వింద్ కేజ్రీవాల్ తో పాటు పంజాబ్ సిఎం భ‌గ‌వంత్ మాన్ తో క‌లిసి ఇవాళ ముంబైలో శివ‌సేన బాల్ ఠాక్రే పార్టీ చీఫ్ , మాజీ సీఎం ఉద్ద‌వ్ ఠాక్రేను మ‌ర్యాద పూర్వ‌కంగా ఆయ‌న నివాసంలో క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా నిప్పులు చెరిగారు కేజ్రీవాల్(Arvind Kejriwal Slams BJP). తాము ప్ర‌జాస్వామ్యాన్ని న‌మ్ముకుని ప‌ని చేస్తున్నామ‌ని కానీ భార‌తీయ జ‌న‌తా పార్టీ కేవ‌లం హింస‌ను మాత్ర‌మే ఆధారంగా చేసుకుని పాల‌న సాగిస్తోంద‌న్నారు. పూర్తిగా అప్ర‌జాస్వామిక ప‌ద్ద‌తులు అవ‌లంభిస్తోందంటూ ధ్వ‌జ‌మెత్తారు.

అందులో భాగంగానే రాజ్యాంగానికి వ్య‌తిరేకంగా బీజేపీయేత‌ర ప్ర‌భుత్వాల‌ను కూల్చ‌డం ప‌నిగా పెట్టుకున్నారంటూ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌, కేంద్ మంత్రి అమిత్ షాపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు అర‌వింద్ కేజ్రీవాల్. ఇలా ఎంత కాలం ప్ర‌జ‌ల‌ను మాయ మాట‌ల‌తో మోసం చేస్తారంటూ ప్ర‌శ్నించారు.

దేశంలో జ‌వాబుదారీ త‌నం అన్న‌ది లేకుండా పోయిందన్నారు. ఇది పూర్తిగా చ‌ట్ట విరుద్ద‌మ‌న్నారు. త‌మ‌కు ఢిల్లీ న‌గ‌ర పౌరులు స్ప‌ష్టంగా త‌మ‌కు మెజారిటీ అప్ప‌గించార‌ని కానీ మూడు సార్లు మేయ‌ర్ , డిప్యూటీ మేయ‌ర్ , స్టాండింగ్ క‌మిటీ స‌భ్యుల ఎన్నిక వాయిదా ప‌డుతూ వ‌చ్చింద‌న్నారు.

చీటికి మాటికి తాము సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వ‌చ్చింద‌న్నారు అర‌వింద్ కేజ్రీవాల్. ఇదే స‌మ‌యంలో కోర్టు లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింద‌ని చెప్పారు. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేర‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సి వ‌చ్చింద‌ని చివ‌ర‌కు మేయ‌ర్ , డిప్యూటీ మేయ‌ర్ పోస్టుల‌ను తామే కైవ‌సం చేసుకున్నామ‌ని తెలిపారు.

ఇదే స‌మ‌యంలో ఆద‌రా బాద‌ర‌గా కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఎలా గుర్తును షిండే వ‌ర్గానికి కేటాయిస్తుందంటూ ప్ర‌శ్నించారు. ఈ స‌మావేశంలో భ‌గ‌వంత్ మాన్ తో పాటు శివ‌సేన బాల్ ఠాక్రే పార్టీ చీఫ్ ఉద్ద‌వ్ ఠాక్రే కూడా హాజ‌రయ్యారు.

Also Read : బీజేపీ సేవ‌లో ఏఎన్ఐ

Leave A Reply

Your Email Id will not be published!