Owaisi : కాంగ్రెస్ నిర్వాకం గుజరాత్ లో బీజేపీకి అధికారం
సంచలన కామెంట్స్ చేసిన ఎంపీ ఓవైసీ
Owaisi : ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ(Owaisi) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అసమర్థత, చేతకానితనం వల్లనే గుజరాత్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో కొనసాగుతోందని నిప్పులు చెరిగారు.
ప్రస్తుతం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 1, 5 తేదీలలో పోలింగ్ కొనసాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్, ఆప్ తో పాటు ఎంఐఎం కూడా ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఓవైసీ ఈ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ లో బీజేపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందంటూ ఆరోపించారు.
ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో తమ పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టేందుకే బరిలో ఉందని, ముస్లిం ఓటు బ్యాంకు చీల్చుతోందంటూ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు ఎంఐఎం చీఫ్. సుదీర్ఘ కాలం పాటు బీజేపీ ఎందుకు అధికారంలో ఉందో ఏనాడైనా కాంగ్రెస్ పార్టీ ఆలోచించిందా అని ప్రశ్నించారు ఓవైసీ.
తమపై ఆధారాలు లేకుండా విమర్శలు చేయడం అలవాటుగా మారిందని మండిపడ్డారు. ఎన్నికల సందర్భంగా ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. కచ్ జిల్లాలో రెండు స్థానాలలో ఎంఐఎం పోటీ చేస్తోందని చెప్పారు. ఓట్లను తాము చీల్చడం లేదన్నారు.
అదంతా పూర్తిగా అబద్దమని కొట్టి పారేశారు. అదంతా చేతకాని వాళ్లు చేస్తున్న ప్రచారమని కొట్టి పారేశారు. కాంగ్రెస్ పార్టీ తమ లోపాలను కప్పి పుచ్చుకునేందుకు తమను టార్గెట్ చేస్తోందంటూ ధ్వజమెత్తారు అసదుద్దీన్ ఓవైసీ(Owaisi).
Also Read : రైతు సంఘాల లాంగ్ మార్చ్