DK Shiva Kumar : మత హింసకు పాల్పడుతున్న బీజేపీ – డీకే
కర్ణాటక కాంగ్రెస్ పార్టీ చీఫ్ శివకుమార్
DK Shiva Kumar : కర్ణాటకలో ఎన్నికల వేడి మరింత ముదిరింది. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్దం ముదురుతోంది. ఇప్పటికే బీజేపీ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ తరుణంలో కాంగ్రెస పార్టీ రాష్ట్ర చీఫ్ డీకే శివకుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
కోస్తా కర్ణాటకలో బీజేపీ హింస, హత్యలకు పాల్పడుతోందంటూ సంచలన ఆరోపణలు చేశారు. మత పరమైన హింసను ప్రేరేపించేలా చేస్తోందంటూ ధ్వజమెత్తారు. దీని కారణంగా రాష్ట్రంలోని తీర ప్రాంతాలలో హత్యలు జరిగాయని ఆవేదన వ్యక్తం ఏశారు డీకే శివకుమార్(DK Shiva Kumar). అయినా ఇంత జరుగుతున్నా బీజేపీ ప్రభుత్వం పట్టించు కోవడం లేదని మండిపడ్డారు.
బీజేపీ నేతల పిల్లలు ఎవరైనా త్రిశూలంతో నిరసన తెలుపుతున్నారా అని ప్రశ్నించారు కర్ణాటక పీసీసీ చీఫ్. బీజేపీ కార్యకర్తలు మాత్రమే మోసానికి లోనవుతున్నారని అన్నారు. కర్ణాటక లోని మంగళూరులో జరిగిన ప్రజా ధ్వని కార్యక్రమంలో భాగంగా సభలో డీకే శివకుమార్ ప్రసంగించారు. చాలా మంది బీజేపీ కార్యకర్తలు చంపబడ్డారు.
అనేక మంది మైనార్టీలు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన చెందారు. బీజేపీ కార్యకర్తలు త్రిశూలాలు, కర్రలు పట్టుకుని పార్టీ కోసం పోరాడుతున్నారని అన్నారు. అయితే పార్టీ కోసం పని చేసేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీల కొడుకులు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు.
పేదల పిల్లలు మాత్రమే ఎందుకు బలి అవుతున్నారంటూ నిలదీశారు డీకే శివకుమార్(DK Shiva Kumar). ప్రస్తుతం చోటు చేసుకున్న మత విద్వేషం కారణంగా ఎవరూ చదువుకునేందుకు ఇక్కడికి రావడం లేదన్నారు .
Also Read : అంబేద్కర్ పార్టీతో శివసేన పొత్తు