BJP Leader Dilip Ghosh: ఐపీఎల్ వేదికగా ప్రేమలో పడ్డ బీజేపీ నేత ! 60వ ఏట పెళ్లి !
ఐపీఎల్ వేదికగా ప్రేమలో పడ్డ బీజేపీ నేత ! 60వ ఏట పెళ్లి !
Dilip Ghosh : పశ్చిమబెంగాల్ బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ దిలీప్ ఘోష్(Dilip Ghosh) 60 ఏళ్ల వయసులో బ్రహ్మచర్యాన్ని వీడి, వివాహబంధంలోకి అడుగు పెట్టారు. పార్టీకి చెందిన మహిళా మహిళా మెర్చా నాయకురాలు రింకూ మజుందార్ (51)ను శుక్రవారం సన్నిహితుల నడుమ ఆయన పెళ్ళి చేసుకున్నారు. 60 ఏళ్ల పాటు బ్రహ్మచారిగా ఉన్న దిలీప్… నాలుగేళ్ళ క్రిందట మహిళా నాయకురాలు రింకూ మజుందార్ తో స్నేహం ఏర్పడటం… ఇటీవల కోల్ కతాలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ చూస్తుండగా… పెళ్లి చేసుకోవడానికి ఇద్దరు నిర్ణయించుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్న కొద్ది రోజులకే… పెళ్ళి పీటలెక్కడంతో బీజేపీ నాయకులు దిలీప్ ఘోష్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
BJP Leader Dilip Ghosh Got Married
తన వివాహం అనంతరం దిలీప్ ఘోష్ మీడియాతో మాట్లాడుతూ… ‘‘ఇది మా అమ్మ కోరిక’’ అన్నారు. భర్తకు విడాకులు ఇచ్చిన మజుందార్ కు ఇది రెండో వివాహం. మజుందార్ తో దిలీప్ కు నాలుగేళ్లుగా పరిచయమున్నప్పటికీ… ఈ నెల మొదటివారంలో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ ను ఇద్దరూ కలిసి చూసిన సందర్భంగా పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నేతలు ఇంటికి వచ్చి దిలీప్ ఘోష్‌ను అభినందించగా, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పుష్పగుచ్ఛాలు పంపారు.
Also Read : Shubhanshu Shukla: వచ్చే నెలలో అంతరిక్షకేంద్రానికి భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా