BJP Leaders Slams : ధర్మపురి అర్వింద్ పై నేతల గుస్సా
రాష్ట్ర ఆఫీసులో ఆందోళన
BJP Leaders Slams : క్రమ శిక్షణ కలిగిన పార్టీగా చెప్పుకుంటున్న భారతీయ జనతా పార్టీలో సైతం నేతలు, కార్యకర్తలు కట్టు తప్పుతున్నారు. బండి సంజయ్ ని తప్పించి కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డికి పార్టీ హైకమాండ్ పగ్గాలు అప్పగించింది. అయినా కంట్రోల్ లో ఎవరూ ఉండడం లేదు. బుధవారం ఉన్నట్టుండి ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పై ఉమ్మడి జిల్లాకు చెందిన బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఎంపీకి వ్యతిరేకంగా ఆందోళన(BJP Leaders Slams) చేపట్టారు.
BJP Leaders Slams Dharmapuri
ఎంపీ అర్వింద్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, తమ మాట వినడం లేదంటూ ఆరోపించారు. 13 మండలాల అధ్యక్షులను మార్చాలని పట్టు పట్టారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిజామాబాద్ జిల్లాలో స్వంత పార్టీకి చెందిన కార్యకర్తలు, నేతలకు ఎంపీ అర్వింద్ అన్యాయం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. ఇదిలా ఉండగా ఉమ్మడి జిల్లాలోని ఆర్మూర్ , బాల్కొండ, బోధన్ నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చారు.
ఇలాగే ఎంపీ వ్యవహరిస్తూ పోతే చివరకు పార్టీలో ఎవరూ ఉండరని హెచ్చరించారు. ఇప్పటికే బీఆర్ఎస్ , బీజేపీ ఒక్కటేనన్న ప్రచారం ఉందని దానిని వదిలించు కుంటేనే పార్టీ బాగు పడుతుందని పేర్కొన్నారు.
Also Read : Monalisa AI Version : ఏఐ వెర్షన్ మోనాలిసా సూపర్