Amit Shah JP Nadda : అభ్యర్థుల లిస్టుపై షాతో నడ్డా భేటీ
పలువురు ఎమ్మెల్యేల అసమ్మతి గళం
Amit Shah JP Nadda : కర్ణాటకలో వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గాను అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ 189 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ మేరకు మంగళవారం విడుదల చేసిన ఈ జాబితాలో 52 మంది కొత్త వారికి ఛాన్స్ ఇచ్చింది.
దీంతో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరికొందరు బాహాటంగానే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్పకు వీర విధేయుడిగా ఉన్న మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మన్ సవాది ఏకంగా బీజేపీపై నిప్పులు చెరిగారు.
తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ తో భేటీ అయినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈ మొత్తం జాబితాపై అభ్యర్థుల ఎంపిక సరిగా లేదంటూ వస్తున్న విమర్శలపై బుధవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో(Amit Shah JP Nadda) కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తొలి జాబితా వెలువడిన వెంటనే పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడే ప్రమాదం పొంచి ఉందంటూ సీనియర్లు చేరవేశారు హై కమాండ్ కు. ప్రస్తుతం అమిత్ షా నివాసంలో ఈ కీలక భేటీ జరుగుతోంది. జేపీ నడ్డాతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ , జాతీయ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక ఇంఛార్జి అరుణ్ సింగ్ , కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఉన్నారు. లక్ష్మణ్ సవాది తనకు అథని నియోజకవర్గం కేటాయించక పోవడంతో ఎమ్మెల్సీకి, బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి గుడ్ బై చెప్పారు.
Also Read : సీఎం గెహ్లాట్ పై మోదీ ప్రశంస