RSS JP Nadda Bhagwat : ఆర్ఎస్ఎస్ మీటింగ్ కు నడ్డా..భగవత్
మార్చిలో జరగనున్న కీలక సమావేశం
RSS JP Nadda Bhagwat : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కీలక సమావేశం వచ్చే మార్చి నెలలో జరగనుంది. ఈ సమావేశానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో పాటు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(RSS JP Nadda Bhagwat) పాల్గొననున్నారు.
అంతే కాదు దత్తాత్రేయ హోసబాలే తో పాటు పలువురు ప్రముఖులు ,బాధ్యులు, నేతలు హాజరు కానున్నారు. సంఘ్ కు చెందిన ఇతర అనుబంధ సంస్థల అధిపతులతో సహా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కు చెందిన ఇతర ప్రముఖులు కూడా పాల్గొననున్నారు.
మార్చి 12 నుంచి 14 వరకు పానిపట్ లో జరిగే ఆర్ఎస్ఎస్ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అఖిల భారతీయ ప్రతినిధి సభ మూడు రోజుల సమావేశంలో సామాజిక సామరస్యం, పర్యావరణం, ఇతర ముఖ్యమైన అంశాలకు సంబంధించిన అంశాలను చర్చించనున్నారు.
భారతీయ జనతా పార్టీతో సహా అన్ని సంస్థలు ఏడాది పొడవునా తాము చేపట్టిన కార్యక్రమాల వార్షిక నివేదికను ఇస్తాయని సమాచారం.
ఇందుకు సంబంధించి అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్ ట్వీట్ చేశారు. ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ ప్రతినిధి సభ 2023 మార్చి 12 నుంచి 14 దాకా హర్యానా లోని సమల్కాలో జరుగుతుందని స్పష్టం చేశారు.
సంఘ్ కు చెందిన ముఖ్యులు, కార్యకర్తలు, దాని అనుబంధ సంస్థల సభ్యులతో సమా దాదాపు 1,800 మంది పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ కీలక మీటింగ్ లో ప్రధానంగా 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎలా విజయం సాధించాలనే దానిపై కూడా చర్చించే ఛాన్స్ ఉంది.
Also Read : అపరిపక్వతతో కూడుకున్న నిర్ణయం – థరూర్