Nishikant Dubey Rahul Gandhi : రాహుల్ పై చ‌ర్య తీసుకోవాలి

రాహుల్ గాంధీ వ్యాఖ్య‌ల‌పై గ‌ర‌గ‌రం

Nishikant Dubey Rahul Gandhi : అదానీ గ్రూప్ కంపెనీస్ చైర్మ‌న్ గౌతమ్ అదానీ వ్య‌వ‌హారం పార్ల‌మెంట్ ను కుదిపేసింది. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ ప్ర‌ధాన‌మంత్రిపై నిప్పులు చెరిగారు. మోదీకి అదానీకి ఉన్న సంబంధం ఏమిటో బ‌య‌ట పెట్టాల‌ని డిమాండ్ చేశారు.

2014 కంటే ముందు అదానీ ర్యాంకు 610 గా ఉండేద‌ని, కానీ ఎప్పుడైతే కేంద్రంలో న‌రేంద్ర మోదీ భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిందో ఆనాటి నుంచి నేటి దాకా అంత‌కంత‌కూ పెరుగుతూ వ‌చ్చింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు రాహుల్ గాంధీ.

ప్ర‌ధాన‌మంత్రిపై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేసిన రాహుల్ గాంధీపై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని డిమాండ్ చేసింది బీజేపీ. స‌భ‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేలా నిరాధార‌మైన వ్యాఖ్య‌లు చేశారంటూ మండిప‌డ్డారు భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ నిషికాంత్ దూబే(Nishikant Dubey).  వెంట‌నే ఎంపీలు, మంత్రులంతా స్పీక‌ర్ కు ఫిర్యాదు చేయాల‌ని కోరారు.

అత్యంత అవ‌మాన‌క‌ర‌మైన రీతిలో ప్ర‌ధాన‌మంత్రి గురించి రాహుల్ గాంధీ మాట్లాడారంటూ మండిప‌డ్డారు. స‌భా మ‌ర్యాద‌ల‌కు భంగం క‌లిగించేలా ఆయ‌న చేసిన కామెంట్స్ ఉన్నాయంటూ ధ్వ‌జ‌మెత్తారు. ఈ మేర‌కు రాహుల్ గాంధీపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ స్పీక‌ర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.

స్పీక‌ర్ కు రాసిన లేఖ‌లో రాహుల్ గాంధీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పూర్తిగా నిరాధార‌మైన‌వి. అవ‌మాన‌క‌ర‌మైన‌వి. అస‌భ్య‌క‌ర‌మైన‌వి..అన్ పార్ల‌మెంట‌రీ లాంగ్వేజ్ వాడారంటూ ధ్వ‌జ‌మెత్తారు. గౌర‌వం లేనివి, స‌భా గౌర‌వానికి భంగం క‌లిగించేవిగా ఉన్నాయంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు శ‌శికాంత్ దూబే.

Also Read : పార్ల‌మెంట్ లో ఎల్ఐసీ..ఎస్బీఐపై ర‌చ్చ‌

Leave A Reply

Your Email Id will not be published!