Haryana Assembly Elections: హరియాణా అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ !
హరియాణా అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ !
Haryana Assembly Elections: హరియాణా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ 67 మంది అభ్యర్థులతో తొలి జాబితాను బుధవారం విడుదల చేసింది. ఈ జాబితాలో పలువురు కీలక నేతల పేర్లను ప్రకటించింది. హరియాణా ప్రస్తుత ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ పేరు ఈ జాబితాలో ఉంది. ఆయన లాడ్వా నుంచి ఎన్నికల బరిలో దిగనున్నారు. అలాగే ఆయన కేబినెట్ మంత్రి అనిల్ విజ్… అంబాలా కంటోన్మెంట్ నుంచి పోటీ చేయనున్నారు. అదే విధంగా బీజేపీ(BJP) రాజ్యసభ సభ్యుడు కిరణ్ చౌదరి కుమార్తె శృతి చౌదరికి సైతం బీజేపీ సీటు కేటాయించింది. ఆమె తోషమ్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగనున్నారు.
Haryana Assembly Elections Update
ఇక గతంలో దుష్యంత్ చౌతాలా జననాయక్ జనతా పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు దేవేంద్ర బబ్లీ, రామ్ కుమార్ గౌతమ్, అనుప్ దానక్‌కు సైతం బీజేపీ(BJP) ఎమ్మెల్యే టికెట్లు కేటాయించింది. ఆక్టోబర్ 5వ తేదీన హరియాణా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఆక్టోబర్ 8వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
మరోవైపు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుపై ఆప్, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే పలు దఫాలుగా చర్చించాయి. అవి ఒక కొలిక్కి అయితే ప్రస్తుతానికి రాలేదు. కానీ చర్చలు మాత్రం జరుగుతున్నాయి. రాష్ట్రంలో అధికార బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలు ఒక తాటిపైకి వచ్చేందుకు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అందులోభాగంగా ఆప్ 20 స్థానాల్లో అభ్యర్థులను నిలపాలని నిర్ణయించింది. అలాగే ఇండియా కూటమిలోని మిగిలిన భాగస్వామ్య పక్షాలు సైతం బరిలో దిగితే… ఆ యా పార్టీలకు సైతం సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. అలాంటి వేళ.. కాంగ్రెస్ పార్టీ ఆలోచించి అడుగులు వేస్తుంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేశాయి. కాంగ్రెస్ పార్టీ 5 ఎంపీ స్థానాలను గెలుచుకోగా.. ఆప్ మాత్రం ఒకే ఒక్క స్థానంలో పోటీ చేసి ఓటమి పాలైన విషయం విధితమే.
Also Read : AP High Court : టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు షాక్ ఇచ్చిన హైకోర్ట్