రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన భారతీయ జనతా పార్టీని, దాని అనుబంధ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై నిప్పులు చెరిగారు. ఆ రెండూ ఫాసిస్టులంటూ కామెంట్స్ చేశారు. ఆపై వాళ్లు సుప్రీంకోర్టు తీర్పును పట్టించుకునే స్థితిలో లేరంటూ మండిపడ్డారు. గురువారం అశోక్ గెహ్లాట్ మీడియాతో మాట్లాడారు.
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై తీవ్రంగా స్పందించారు రాజస్థాన్ సీఎం గెహ్లాట్. దాని గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంపై అనర్హత వేటు వేయలేమన్నారు. ఉద్దవ్ ఠాక్రేను తిరిగి సీఎంగా నియమించాలన్న సమర్పణను తిరస్కరించింది ఇవాళ. అయితే అసెంబ్లీలో బల పరీక్షకు బదులు రాజీనా చేయాలని నిర్ణయించు కోవడం వల్లనే ఇది జరిగిందంటూ కోర్టు అభిప్రాయ పడింది.
ఈ సందర్భంగా సీఎం అశోక్ గెహ్లాట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్య ప్రదేశ్ , మహారాష్ట్ర, కర్ణాటకలలో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను బీజేపీ అక్రమ పద్దతిలో పడగొట్టిందంటూ ఫైర్ అయ్యారు. తాను గనుక గట్టిగా లేక పోయి ఉండి ఉంటే రాజస్థాన్ లో కూడా తన ప్రభుత్వాన్ని పడగొట్టే వాళ్లంటూ సంచలన ఆరోపణలు చేశారు అశోక్ గెహ్లాట్.
ఇదిలా ఉండగా ప్రస్తుతం సీఎం అశోక్ గెహ్లాట్ చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాలలో కలకలం రేపుతున్నాయి. తాజాగా తన పర్యటనలో ఉన్న ప్రధానమంత్రిని సైతం ఏకి పారేశారు. ముందు ప్రతిపక్షాలను గౌరవించడం నేర్చుకోవాలని సూచించారు గెహ్లాట్.
