BJP Senior Leaders : మోదీ స‌భ‌కు సీనియ‌ర్లు డుమ్మా

పార్టీ నాయ‌క‌త్వంపై అసంతృప్తి

BJP Senior Leaders : హైద‌రాబాద్ – భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కులు తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్టు స‌మాచారం. సాక్షాత్తు దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ నిజామాబాద్ లో జ‌రిగిన భారీ బ‌హిరంగ స‌భ‌కు వ‌చ్చినా స‌ద‌రు నేత‌లు ముఖం చాటేశారు.

BJP Senior Leaders Presence Viral

సీనియ‌ర్ల గైర్హాజ‌ర్ పై ప్ర‌స్తుతం పార్టీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. డుమ్మా కొట్టిన నేత‌లు ప్ర‌స్తుత బీజేపీ రాష్ట్ర నాయ‌క‌త్వంపై తీవ్ర నిరాశ‌కు లోన‌వుతున్న‌ట్టు టాక్. ఇదిలా ఉండ‌గా మోదీ స‌భ‌కు హాజ‌రు కాని నేత‌ల్లో కోమ‌టి రెడ్డి రాజ గోపాల్ రెడ్డి, విజ‌య శాంతి, ఏనుగు ర‌వీంద‌ర్ రెడ్డి, వివేక్ వెంక‌ట‌స్వామి, కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డిలు ఉన్నారు.

కొంత కాలం నుండి వీరంతా గుర్రుగా ఉన్నారు. బండి సంజ‌య్(Bandi Sanjay) బీజేపీ చీఫ్ గా ఉన్న స‌మ‌యంలో వీరంతా యాక్టివ్ గా వ్య‌వ‌హ‌రించారు. తీరా చూస్తే వీరంతా సీనియ‌ర్లు కావ‌డం గ‌మ‌నార్హం. పార్టీ ప‌రంగా నిర్వ‌హించే ఏ కార్య‌క్ర‌మాల‌కు వీరు హాజ‌రు కావ‌డం లేదు.

మ‌రో వైపు రాష్ట్రంలో ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం కొన‌సాగుతోంది. ఈ స‌మ‌యంలో బీజేపీలో నాయ‌క‌త్వ లోపం కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. ఇదిలా ఉండ‌గా ఉన్న‌ట్టుండి మాజీ బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ దూకుడు పెంచారు. కేసీఆర్ పై మాట‌ల తూటాలు పేల్చారు. ద‌మ్ముంటే భాగ్య‌ల‌క్ష్మి అమ్మ వారి గుడికి రావాల‌ని స‌వాల్ విసిరారు.

Also Read : Pawan Kalyan : జ‌గ‌న్ కు ప‌వ‌న్ వార్నింగ్

Leave A Reply

Your Email Id will not be published!